బెంగళూరులో బొంబాయి లేడీస్ గ్యాంగ్ అరెస్ట్
వనిత గైక్వాడ్ ఈ బృందానికి నాయకత్వం వహించిందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో 37 దొంగతనాలు, చోరీలను
ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగిలించేందుకు కుట్ర పన్నిన ముంబయికి చెందిన ముగ్గురు మహిళలను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక రాజేష్ మోగ్రే (29), మహాదేవి (26), వనితా గైక్వాడ్ (37) అనే మహిళలు.. ముంబై నుండి నేరాలు చేయడానికి ఇటీవల బెంగళూరు వచ్చారు. ఇళ్లల్లో పనులు చేసుకుంటామని చెబుతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంది ఈ గ్యాంగ్. తాజాగా వారిని అరెస్ట్ చేయడంతో.. వారి నుంచి 250 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వనిత గైక్వాడ్ ఈ బృందానికి నాయకత్వం వహించిందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో 37 దొంగతనాలు, చోరీలను పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రియాంక 12వ తరగతి వరకు చదివి సోషల్ మీడియాపై అవగాహన కలిగి ఉంది. ఈ ముఠా ఏప్రిల్‌లో బెంగళూరుకు వచ్చింది. ప్రియాంక 'రిఫర్ హౌస్ మెయిడ్స్, బెంగళూరు' పేరుతో ఫేస్‌బుక్ పేజీలో తాము పని చేస్తామని ప్రకటనను పోస్ట్ చేసింది.
అరవింద్ ఆర్ అనే బిల్డర్ వారిని సంప్రదించాడు. మహాదేవి, హొరమావు అగరా సమీపంలోని అతని ఫ్లాట్‌లో అరవింద్‌ని సంప్రదించి, దక్షిణ కన్నడకు చెందిన సుబ్బులక్ష్మి అని పరిచయం చేసుకుంది. మే 3న ఇంట్లో పనిమనిషిగా చేరేందుకు ఐడీ ప్రూఫ్‌గా నకిలీ ఆధార్‌కార్డు ఇచ్చి, మే 6న 250 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వస్తువులతో పరారైంది. అరవింద్ ఫిర్యాదు మేరకు హెన్నూరు పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. బెంగళూరులో ఇది తమ మొదటి నేరమని నిందితులు పేర్కొన్నారని, అయితే వారిపై ముంబైలో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ప్రియాంక, మహాదేవి లకు కొన్నాళ్ల క్రితం వనితతో పరిచయం ఏర్పడింది. వారు ముంబైలోని అపార్ట్‌మెంట్‌లను సందర్శిస్తారు, సెక్యూరిటీ గార్డులతో స్నేహం చేస్తారు. వారి సిఫార్సుతో ఇంటిలో పని మనుషులుగా ఉద్యోగాలు చేయడానికి పని పొందుతారు. వారం రోజుల్లోనే విలువైన వస్తువులను దొంగిలించి అదృశ్యమయ్యేవారు. బెంగళూరులో మాత్రం ఉద్యోగాలు వెతుక్కోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించారు. ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ (తూర్పు) భీమశంకర్ ఎస్ గులేద్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ యాడ్‌లో పేర్కొన్న మొబైల్ నంబర్ ద్వారా పనిమనిషి ముంబై నుంచి వచ్చినట్లు పోలీసులకు తెలిసింది. ఉప్పరపేట సమీపంలోని ఓ లాడ్జిలో ఉండేవారు. మహాదేవి విలువైన వస్తువులను దొంగిలించిన వెంటనే నగరం విడిచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.