టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో మలుపు.. వీరిపై ఈడీ పిటిషన్ !

డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వట్లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై ఈడీ కోర్టు

Update: 2022-03-24 04:15 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వట్లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌ను శిక్షించడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది. సోమేశ్ కుమార్, సర్పరాజ్ అహ్మద్ కు ఈ నెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపామని, త్వరలోనే ఈ పిటిషన్ పై విచారణ జరగుతుందని ఈడీ పేర్కొంది.

కాగా.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలను ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో.. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటాను ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది.



Tags:    

Similar News