పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. పెళ్లి ఊరేగింపుపై బొలేరో వాహనంపై దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు;

Update: 2023-11-12 03:42 GMT
sheikh sabji, mlc, died,  road accident, from eluru to bhimavaram

sheikh sabji

  • whatsapp icon

అనంతపురం జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. పెళ్లి ఊరేగింపుపై బొలేరో వాహనంపై దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మృతుల సంఖ్య...
అయితే పంపనూరు గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా బొలేరో వాహనం దూసుకు వచ్చింది. దీంతో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులందరూ రోడ్డుపైకి ధర్నాకు దిగారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News