చెన్నైలో విషాదం... కోవిడ్ అని తల్లీకొడుకుల ఆత్మహత్య

చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందని తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కలచి వేస్తుంది

Update: 2022-01-09 07:03 GMT

చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందని తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కలచి వేస్తుంది. మధురైలోని ఎంజీఆర్ కాలనీ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా ప్రాణాంతకమైన వ్యాధి అని, చనిపోతామని భావించి తల్లీ కొడుకులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

నలుగురు కుటుంబ సభ్యులు....
ప్రస్తుతం దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వల్ల మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెద్దగా లేదు. అయితే ఎంజీఆర్ కాలనీ లో జ్యోతిక కుటుంబంలో ఆరుగురున్నారు. జ్యోతిక నాలురోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. దీంతో ఆరుగరు విషం తాగి ఆత్మహత్యకు మరణించారు. కరోనా టెస్ట్ లు కూడా చేయించుకోలేదు. జ్వరం రావడంతో కరోనా అని భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లీ కొడుకులు మరణించగా మరో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.


Tags:    

Similar News