ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. తెలంగాణ నుంచి బెజవాడకు వచ్చి?
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడ కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా నదిలో దూకి తండ్రి, కొడుకులు గల్లంతయ్యారు. దీంతో కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఆత్మహత్యకు కారణాలు....
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వీరు తెలంగాణ నుంచి వచ్చి విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ఆచూకీ కోసం తెలంగాణ పోలీసులను సంప్రదిస్తున్నారు. ఆర్థిక బాధలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా దుర్గమ్మ దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణా నదిలో గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.