Breaking : క్వారీ కూలి పది మంది కార్మికుల సజీవ సమాధి
మిజోరోంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీ కూలి పది మంది కూలీలు మరణించారు.;
మిజోరోంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీ కూలి పది మంది కూలీలు మరణించారు. మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్రానైట్ క్వారీ కూలిపోవడంతో పది మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరు కార్మికులు శిధిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
శిధిలాల కింద...
అయితే మిజోరాంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. శిధిలాల కింద ఎంత మంది ఉన్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కార్మికుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. శిధిలాల కింద చిక్కుకున్న వారు కూడా బతికే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తం మీద మిజోరాంలో జరిగిన ఈఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపింది.