విషాదం.. ఐదుగురు కూలీల మృతి
పాలమూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ తెగి ఐదుగురు కూలీలు మృతి చెందారు.
పాలమూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ తెగి ఐదుగురు కూలీలు మృతి చెందారు. పాలమూరు - రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టు లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో పంప్ హౌస్ లో కి క్రేన్ సాయంతో దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడింది. ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
బీహార్ కు చెందిన...
మరొక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతులంతా బీహార్ కు చెందిన కూలీలలని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం హైదరబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.