సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణం
కుషాయిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.
కుషాయిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. గాదె సతీష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంచి జీతం. ఇద్దరు పిల్లలు. ఆనందంతో గడపాల్సిన ఆ కుటుంబంలో అనారోగ్యం ప్రవేశించింది. పిల్లలిద్దరూ అనారోగ్యం పాలవడంతో గత కొద్ది రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలా ఆసుపత్రిలవద్ద చూపించారు.
అనారోగ్యమే...
కానీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడకపోగా రోజురోజుకూ మరింత క్షీణిస్తుంది. దీంతో సతీష్ తన భార్య వేద, తొమ్మిదేళ్ల నిషికేత్, ఐదేళ్ల నిహాల్ కు టీలో పొటాషియ సెనైడ్ కలిపి ఇచ్చారు. వారు ముగ్గురు మరణించిన తర్వాత సతీష్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో సతీష్, వేదల కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.