Breaking : కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి

శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు మరణించారు;

Update: 2023-12-04 05:16 GMT
training plane, crashed, two pilots, died, medak district
  • whatsapp icon

శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు మరణించారు. ఈరోజు ఉదయమే ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధిలోని రావెల్లి శివారుల్లో జరిగింది. హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తి కూలిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

కూలిన వెంటనే...
కూలిన వెంటనే విమానం మంటలు అంటుకుని అగ్నికి ఆహుతయ్యింది. అయితే ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని చెబుతున్నారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే ఘటన స్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. మరణించిన వారు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా అంందాల్సి ఉంది.


Tags:    

Similar News