Road Accident : సంక్రాంతి వేళ విషాదం.. కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

తెలంగాణలో విషాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు;

Update: 2025-01-13 05:37 GMT

సంక్రాంతి పండగ వేళ తెలంగాణలో విషాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులిద్దరూ తండ్రీ కొడుకులు. హైదరాబాద్ నుంచి గోదావరి ఖనికి సంక్రాంతి పండగకు వస్తుండగా గాంధీనగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

కుటుంబ సభ్యులు గాయపడి...
ఈ కారు ప్రమాదంలో సతీష్ అనే వ్యక్తితో పాటు కుమారుడు స్వాత్విక్ కూడా మరణించారు. సతీష్ సింగరేణి కార్మికుడు కాగా, కార్తీక్ వయసు పదకొండు నెలలు మాత్రమే. కారులో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కరీంనగర్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News