పోలీసుల వేధింపులు : యువకుడి ఆత్మహత్య
నంద్యాల ఎస్ఐ సుబ్బరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నాగన్న, ఏసుదాసు తనను వేధించారని వాపోయాడు చినబాబు. సీసీ కెమెరాలో కనిపించిన..
పోలీసుల వేధింపులు తాళలేక నంద్యాల జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనపై బైక్ దొంగతనం కేసు బనాయించి, దానిని ఒప్పుకోవాలని వేధిస్తున్నారని, అందుకే మనస్తాపంతో చనిపోతున్నానంటూ గడిపాటిగడ్డకు చెందిన చినబాబు(22) అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత మహానంది మండలం గోపవరం వద్ద రైలుకింద పడి బలవన్మరణం చెందాడు.
నంద్యాల ఎస్ఐ సుబ్బరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నాగన్న, ఏసుదాసు తనను వేధించారని వాపోయాడు చినబాబు. సీసీ కెమెరాలో కనిపించిన చిన్న ఫొటో పట్టుకుని.. తనే దొంగతనం చేశాడంటూ స్టేషన్ కు తీసుకెళ్లారని తెలిపాడు. అక్కడ కనిపించింది తాను కాదని, తనలానే ఎవరో ఉన్నారని చెప్పినా వినకుండా.. కానిస్టేబుల్ నాగన్న, వన్ టౌన్ ఎస్సై, కానిస్టేబుల్ ఏసుదాసు కలిసి నిన్నంతా స్టేషన్లో ఉంచి కొట్టారని చెప్పాడు. ఈరోజు కూడా స్టేషన్ కు రమ్మన్నారని, వెళ్తే తాను చేయని తప్పు ఒప్పుకోవాల్సి ఉంటుందన్నాడు. నిజానికి దొంగిలించబడిన బండి గురించి తనకు తెలియదని, దొంగతనమంటేనే నచ్చని తనపై దొంగతనం కేసు వేస్తే ఎలా అని, అందుకే మనస్తాపంతో చనిపోతున్నానని వీడియోలో పేర్కొన్నాడు చినబాబు.