తల్లి కళ్లెదుటే.. చిన్నారిని చిదిమేసిన వ్యాన్ చక్రాలు
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో తోట సుమన్ విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా సుమన్ మూడ్రోజులు
అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఆ చిన్నారిలో క్షణమైనా లేకుండానే.. రోడ్డు ప్రమాదం రూపంలో చిన్నారిని మృత్యువు కబళించింది. తల్లి, అమ్మమ్మతో కలిసి చిన్నారి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఓ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నరి రోడ్డుపై పడిపోగా.. తలపై నుంచి వ్యాన్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరిగి, కళ్లెదుటే కన్నబిడ్డ మరణించడంతో ఆ తల్లి, అమ్మమ్మల రోదనలు మిన్నంటాయి.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో తోట సుమన్ విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా సుమన్ మూడ్రోజులు అంతర్వేదికి వెళ్లారు. అల్లుడు ఊళ్లో లేకపోవడంతో.. అత్త దుర్గాభవాని కూతురు స్వరూప, మనుమరాలు ఆద్య లను తన ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రతిపాడు వచ్చింది. ముగ్గురూ ద్విచక్రవాహనంపై వేమగిరికి బయల్దేరారు. రాజానగరం సమీపంలోకి రాగానే.. వెనుక నుంచి ఓ వ్యాను అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగకుండా పాప తలపై నుంచి వ్యాన్ ముందుకు వెళ్లిపోవడంతో.. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి, అమ్మమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పాప మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.