బెజవాడ వాసు.. మామూలోడు కాదండోయ్..ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడో తెలిస్తే?

బెజవాడలో సామాన్య కుటుంబం నుంచి వచ్చి అడ్డదారిలో ఎదిగి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాసు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు

Update: 2024-05-23 02:37 GMT

బెంగళూరు ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించిన వాసుది బెజవాడ. బెజవాడలో ఒక సామాన్య కుటుంబం నుంచి అడ్డదారిలో ఎదిగి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాసు అన్ని అసాంఘిక కార్యక్రమాలకు తెరతీశారంటారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అతి స్వల్ప కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించిన వాసు ఆస్తులను భారీగానే కూడబెట్టారని చెబుతున్నారు. వాసుకి చిన్న నాటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఆ పిచ్చే అతనని బెట్టింగ్ ల వైపు నెట్టింది. బెజవాడ నుంచి హైదరాబాద్, ముంబయి, చెన్నై ఇలా ఇతర రాష్ట్రాల్లో తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని కొద్ది కాలంలోనే వాసు విస్తరించగలిగాడు.

Full Viewసాధారణ కుటుంబం...
వాసుది విజయవాడలో సాధారణ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. దీంతో వాసు తల్లి దోసెలు వేసుకుని వాసును పెద్దవాడిని చేసింది. వాసుకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. కానీ వాసు మాత్రం పెడదారిని ఎంచుకున్నారు. దానిని రాచమార్గంగా మలచుకోవాలని భావించాడు. క్రికెట్ బుకీ గా మారడంతో ఆయనకు ఆయాచితంగా డబ్బు వచ్చి పడేది. వాసు కుటుంబం విజయవాడ ఆంజనేయ వాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధిలో వాసు కుటుంబం నివసించేది. అయితే ఎవరికీ ఈ స్థాయికి వెళ్లేందుకు అడ్డదారులు తొక్కాని తెలియదు.
విదేశాల్లో ఉద్యోగమంటూ...
ఇతర దేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నానని నమ్మించాడు. క్రికెట్ పై అభిమానంతో ఆ ఆట రాకపోయినా బెట్టింగ్ లకు పాల్పడేవారు. ఇందుకోసం గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు తదితర పట్టణాల్లో తన గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని నెట్ వర్క్ కింద వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. అందరికీ వేతనాలు భారీగానే చెల్లిస్తుండటంతో వాసుకు అమాంతం సమాజంలో గౌరవం కూడా పెరెగింది. వాసుకు పెళ్లి అయింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. వాళ్లంతా విజయవాడలోనే ఉ:టారు.
సెలబ్రిటీలతో స్నేహం...
పెద్ద పెద్ద కార్లలో వస్తుండటంతో వాసు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చుట్టుపక్కల వారు భావించేవారు. కోటి రూపాయల విలువైన నాలుగు కార్లు వాసు కొనుగోలు చేశాడు. దీంతో పాటు అనేక ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లు కొనుగోలు చేశాడు. అక్రమ సంపదాన లక్ష్యంగా వాసు ఎదిగిన తీరును చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలలో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశఆడు. అయితే రేవ్ పార్టీలు నిర్వహిస్తూ కొందరు ధనికుల సంతానం కళ్లలో పడ్డాడు. పార్టీలకు సెలబ్రిటీలను రప్పించడంతో పార్టీ అంటే వాసు పేరు గుర్తుకు వచ్చేలా చేసుకున్నాడు. అంతే దశ మరింత తిరిగింది. ఇంత వరకూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకున్న వాసు చివరకు బెంగళూరు రేవ్ పార్టీలో దొరకడంతో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నారు.


Tags:    

Similar News