కారులో గ్యాస్ లీక్.. అమెరికాలో విజయవాడ అమ్మాయి మృతి

అమెరికాలో చదువుకోడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి ఊహించని;

Update: 2023-12-21 00:47 GMT

vijayawada student lost life in america 

అమెరికాలో చదువుకోడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విజయవాడకు చెందిన యువతి ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్ళింది. విజయవాడ రూరల్ ప్రసాదంపాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్‌ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్ళింది. బుధవారం నాడు ఆమె కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌ లీకవడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్‌ స్పృహ తప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషయాన్ని అక్కడి జహీరా నాజ్ స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. జహీరా నాజ్ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన తమ అమ్మాయి ఇలా ప్రాణాలు కోల్పోతుందని అసలు ఊహించలేదని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమె మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. ఈ ఘటనతో ప్రసాదంపాడులో విషాద చాయలు అలముకున్నాయి. విద్యార్థిని మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News