ఆమెరికాలో భారతీయ సంతతి యువతి మృతి
అమెరికాలో భారతీయ సంతతి యువతి మరణించింది. అమెరికాలో నివసిస్తున్న పతివాడ లహరి అదృశ్యమై తర్వాత శవమై కనిపించింది.
అమెరికాలో భారతీయ సంతతి యువతి మరణించింది. అమెరికాలో నివసిస్తున్న పతివాడ లహరి అదృశ్యమై తర్వాత శవమై కనిపించింది. అమెరికాలోని టెక్సాస్ నగరంలో కొన్ని రోజుల క్రితం ఇరవై ఐదేళ్ల లహరి అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. . సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో లహరి మృతదేహం లభ్యమైంది.
ఫోన్ ను ట్రాక్ చేసి...
టెక్సాస్‌లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్‌వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు. వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ ద్వారా ఆమె అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్‌ను ట్రాక్ చేశారు. బ్లూ వ్యాలీ వెస్ట్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు.