వాంతి చేసుకోడానికి బస్సు నుండి తల బయటపెట్టింది.. అంతే!
ప్రయాణాలు చేసే సమయంలో కొందరికి వాంతి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వాహనాలను
ప్రయాణాలు చేసే సమయంలో కొందరికి వాంతి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వాహనాలను ఆపించడమో.. లేదంటే విండో నుండి తల బయటపెట్టడమో చేస్తూ ఉంటారు. అయితే ఈ పని అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అలా బస్సు నుండి తల బయటపెట్టిన యువతికి ఊహించని విధంగా చావు ఎదురైంది.
ఢిల్లీలో బస్సు కిటికీలోంచి వాంతులు చేసుకునేందుకు ప్రయత్నించిన 20 ఏళ్ల యువతి తల రెండు వాహనాల మధ్య నుజ్జునుజ్జు కావడంతో మృతి చెందింది. హర్యానా రోడ్‌వేస్ బస్సులో ఈ ఘటన అలీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన బాబ్లీ కశ్మీర్ గేట్ నుండి లూథియానాకు బస్సు ఎక్కింది. వాంతి చేసుకునేందుకు బస్సు కిటికీలోంచి ఆమె తల బయటపెట్టడంతో రెండు బస్సుల మధ్య ఇరుక్కుని దుర్మరణం చెందింది.
బాబ్లీ అనే యువతి(20) తన సోదరి, ఆమె భర్త వారి ముగ్గురు పిల్లలతో కలిసి లూథియానా వెళ్లేందుకు కశ్మీర్ గేటు వద్ద హర్యానా రోడ్ వేస్ సంస్థ బస్సు ఎక్కింది. కాగా, అలీపూర్ ప్రాంతానికి రాగానే ఆమెకు వాంతి రావడంతో కిటికీలోంచి తల బయటపెట్టింది. అదే సమయంలో మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండటంతో రెండు బస్సుల మధ్య ఆమె తల నలిగి దుర్మరణం చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మరో వాహనం కోసం గాలిస్తున్నారు.