పేకాట ఆడుతూ దొరికిన మహిళలు
హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. పోలీసుల చేతికి చిక్క కుండా ఒక అపార్ట్మెంట్లో
హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. పోలీసుల చేతికి చిక్క కుండా ఒక అపార్ట్మెంట్లో కూర్చొని రహస్యంగా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పేకాటరా యుళ్లందరూ లక్షల్లో డబ్బులను పెట్టి పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటువంటి పేకాటరా యుళ్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వారిని అరెస్టు చేస్తున్నారు.అయితే మగవారికి మేమేం తక్కువ కాదు అంటూ ఆడవాళ్ళు సైతం పేకాట ఆడి పోలీసుల చేతికి చిక్కిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో నివాసం ఉంటున్న మహిళ లందరూ కలిసి రాత్రి సమ యంలో ఒక అపార్ట్మెంట్లో కూర్చొని లక్షల్లో డబ్బులు పెట్టి రమ్మీ ఆడుతున్నారు... అయితే గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం కొనసాగు తుంది. వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే ఆ అపార్ట్మెంట్ పై దాడి చేసి మహిళలందరినీ అరెస్టు చేశారు. రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న13 మంది మహి ళలు పోలీసుల చేతికి చిక్కారు... అందులో ఐదుగురు వ్యాపారవేత్తలు కాగా మరో ఏడుగురు హౌస్ వైఫ్ లుగా ఉన్నారు... వీరందరి వయసు 50 నుండి 70 సంవత్సరాల వరకు ఉంటుంది... పోలీసులు అరెస్టు చేసిన మహిళల వద్ద నుండి ఒక లక్ష 20 వేల నగదు, పేకాట కార్డ్స్ ,వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు... గత రెండు నెలలుగా తాము గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ట్లుగా మహిళలు ఒప్పుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.