కబడ్డీ పోటీల్లో విషాదం.. ఆడుతూ యువకుడు మృతి
దాంతో తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే యువకుడిని విశాఖలోని కేజీహెచ్ కు..
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి జరిగింది. విజయనగరం జిల్లాలోని నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా నిర్వహించిన పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పాల్గొనేందుకు జట్లు వచ్చాయి.
ఈ పోటీల్లో ఎరుకొండ - కొవ్వాడ జట్లు తలపడగా.. ఆటలో ఉన్న రమణ అనే ఎరుకొండ గ్రామానికి చెందిన యువకుడు ఆడుతూనే కిందపడిపోయాడు. దాంతో తలకు బలంగా దెబ్బ తగలడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. వెంటనే యువకుడిని విశాఖలోని కేజీహెచ్ కు తరలించగా.. చికిత్స పొందుతూ రమణ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రమణ ఆకస్మిక మరణంతో.. అతని కుటుంబంలో ఎరుకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అంది వచ్చిన కొడుకు ఇకలేడని తెలిసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.