నల్గొండలో యువకుడి హత్య.. వెంటాడి మరీ నరికేశారు
త్రిపురారం మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ (21) మిర్యాలగూడలో కారు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి
ప్రేమ కొందరికి వరమైతే.. ఎందరికో శాపమవుతుంది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో కొందరే సంతోషంగా ఉంటున్నారు. మిగతా వారు మనస్ఫర్థలతో విడిపోవడం లేదా పరువు హత్యలకు గురికావడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా నల్గొండలో ఓ యువకుడిని యువతి తరపు బంధువులు వెంటాడి మరీ నరికి చంపేశారు. జిల్లాలోని నిడమనూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం నడిరోడ్డుపై నలుగురూ చూస్తుండగానే ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
త్రిపురారం మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ (21) మిర్యాలగూడలో కారు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి 20 ఏళ్ల యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల ఆమెను ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన నవీన్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రి పాలయ్యాడు. అతను కోలుకున్నాక యువతి బంధువులు నవీన్ గురించి తెలుసుకుని, అతని ఫోన్ చేసి యువతిని మరచిపోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో నవీన్ నిన్న అన్నారంకే చెందిన మిత్రుడు ఈట అనిల్‌తో కలిసి నిడమనూరు మండలం గుంటిపల్లికి చెందిన పాల్వాయి తిరుమల్ వద్దకు వచ్చి అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ పెళ్లికి ఒప్పించాలని కోరాడు.
నవీన్ కోసం తిరుమల్ యువతి బంధువులకు ఫోన్ చేసి.. మాట్లాడుకుందాం రమ్మని చెప్పాడు. సరేనన్న బంధువులు.. రావడమే 9 మంది కత్తులతో నవీన్ పై దాడికి పాల్పడ్డారు. నవీన్ తో ఉన్న తిరుమల్, అనిల్ ను బెదిరించగా వారిద్దరూ పరారయ్యాడు. భయంతో నవీన్ పారిపోయేందుకు యత్నంచగా.. కొంత దూరం వెళ్లాక కిందపడిపోయాడు. అతడిని పట్టుకున్న నిందితులు చాతీ, పొట్ట భాగాల్లో విచక్షణ రహితంగా పొడిచారు. స్థానికులు అదంతా గమనించి నవీన్ ను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. నవీన్ స్నేహితుడు అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు దళితుడు కావడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.