యువతి ఉసురు తీసిన ఆన్ లైన్ గేమ్

నెల్లూరు జిల్లా తురకపల్లికి చెందిన కవిత.. ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడింది. గేమ్స్ ఆడి డబ్బు సంపాదించాలన్న..

Update: 2023-06-21 06:48 GMT

nellore crime news

ఈజీ మనీ.. ఈ రోజుల్లో ఇదే యువతను ప్రధానంగా ఆకర్షిస్తోంది. కష్టపడకుండా స్మార్ట్ ఫోన్ లో తక్కువ పెట్టుబడితో గేమ్స్ ఆడితే.. అంతకు అంత డబ్బు సంపాదించవచ్చని.. వివిధ గేమింగ్ యాప్ లు ఆశ చూపి ఉసురు తీస్తున్నాయి. ఆన్ లైన్ లోన్లు, ఆన్ లైన్ గేమింగ్ లు యువత పాలిట శాపాలుగా మారాయి. ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి డబ్బు సంపాదించవచ్చని అత్యాశకు పోయిన ఓ యువతి రూ.3 లక్షలు పోగొట్టుకుంది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో.. మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది.

నెల్లూరు జిల్లా తురకపల్లికి చెందిన కవిత.. ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడింది. గేమ్స్ ఆడి డబ్బు సంపాదించాలన్న ఆశ రోజురోజుకీ ఎక్కువైంది. ఈ క్రమంలో తల్లిఖాతాలోని డబ్బంతా గేమింగ్ లో పెట్టి నష్టపోయింది. అయినా ఆశ చావలేదు. తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర అప్పు చేసి మరీ గేమ్స్ ఆడింది. రూ.3 లక్షలు నష్టపోయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు.. ఇదేం పని అంటూ కవితను మందలించారు. దాంతో మనస్తాపం చెందిన కవిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పిల్లల ప్రాణాలు తీసే.. ఇలాంటి గేమింగ్ యాప్ లను బ్యాన్ చేయాలని పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Tags:    

Similar News