మెడికల్ చెకప్ కోసం యువకుడిని వీడియో పంపమన్నారు.. ఊహించని ఘటనలు
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మెడికల్ చెకప్ కోసం తన న్యూడ్ వీడియోను పంపాల్సిందిగా
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందిన ఓ యువకుడు వాట్సాప్‌లో తన నగ్న వీడియోలతో గుర్తు తెలియని వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించాడు. ఉద్యోగం కోసం మెడికల్ చెకప్ పరీక్ష చేయించుకుందామని నిందితులు తన న్యూడ్ వీడియోను అడిగారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. రూ.25 వేలు ఇవ్వాలని, లేకుంటే తన వీడియోను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో అప్‌లోడ్ చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఈ సంఘటన రాంపూర్ ఖర్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నానని ఆ నిరుద్యోగ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో కూడా వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇందుకు సంబంధించి పలు అవసరమైన పత్రాలను సమర్పించినట్లు తెలిపారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 9న తనకు కాల్ వచ్చిందని, విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మెడికల్ చెకప్ కోసం తన న్యూడ్ వీడియోను పంపాల్సిందిగా కాలర్ కోరాడని తెలిపాడు. తన మొబైల్ ఫోన్‌లో వీడియో పంపితే మెడికల్ చెకప్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని నిందితులు బాధితుడిని వాట్సాప్‌లో తన నగ్న వీడియోను పంపేలా ప్రలోభపెట్టారు. ఒక రోజు తర్వాత, బాధితుడికి మరో నంబర్ నుండి కాల్ వచ్చింది. అతను తన వీడియోలను వేర్వేరు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి రూ.25,000 చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశాడు. "వీడియోను తొలగించమని నేను చాలాసార్లు కాలర్‌ని అభ్యర్థించాను, కాని అతను నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు. రూ. 25,000 చెల్లించమని అడిగాడు. కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసాడు" అని బాధితుడు తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు తన స్నేహితులకు తన బాధను వివరించాడు. రాంపూర్ ఖార్ఖానా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.