Praneeth Hanumanthu: ఎట్టకేలకు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

సోషల్ మీడియాలో తండ్రి, కూతురు బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ

Update: 2024-07-10 11:20 GMT

సోషల్ మీడియాలో తండ్రి, కూతురు బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పెట్టిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకు రానున్నారు. ఇప్పటికే అతడి మీద సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ప్రణీత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు సినీ ప్రముఖులే కాకుండా పలువురు ప్రముఖులు కూడా తప్పుబట్టారు.

అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు పైన కూడా సైబర్ క్రైమ్ బ్యూరో కేసులు నమోదు చేసింది. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఈ విధంగా కామెంట్లు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసుకుని నిందితుడు హనుమంతు కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతను బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడికి వెళ్లి హనుమంతును అదుపులోకి తీసుకున్నారు.
ఒక వీడియోలో “అసహ్యకరమైన” వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై తెలంగాణ సైబర్ బ్యూరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. క్లిప్‌లో కొందరు తండ్రీ-కూతుళ్ల బంధానికి లైంగిక రంగును పూయడం చూపిస్తుంది. దీనిపై యూట్యూబర్ క్షమాపణలు చెప్పారు. ఈ వీడియోపై నటుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. “భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన చర్యలను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని” విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.


Tags:    

Similar News