జమిలికి అదే కరెక్ట్ ముహూర్తం…?
జమిలి ఎన్నికలు అంటూ అదే పనిగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ఢిల్లీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ పెద్దల మోజు తీరే ఘడియలు కూడా దీంతో [more]
;
జమిలి ఎన్నికలు అంటూ అదే పనిగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ఢిల్లీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ పెద్దల మోజు తీరే ఘడియలు కూడా దీంతో [more]
జమిలి ఎన్నికలు అంటూ అదే పనిగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా ఢిల్లీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ పెద్దల మోజు తీరే ఘడియలు కూడా దీంతో రాబోతున్నాయి. అన్నింటా ఏకత్వాన్ని చూసే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ ఏడేళ్ళుగా పరితపిస్తోంది. ఇపుడు దానికి తగిన ముహూర్తం కూడా సిద్ధమైందని అంటున్నారు. మోడీ సర్కార్ కూడా దానికి తగినట్లుగానే అన్ని పనులనూ వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఎన్నికలు జరిగే నాటిని తాను సిధ్ధంగా ఉండాలన్నదే బీజేపీ ప్రణాళికగా కనిపిస్తోంది.
డిసెంబర్ లోనే….
జమిలి ఎన్నికలు 2022 డిసెంబర్లో జరుగుతాయని ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తున్న మాట. ఆ సమయం అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక అప్పటికి మోడీ ప్రభుత్వాం మూడున్నరేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. అలాగే ఏపీలో కూడా జగన్ మూడున్నరేళ్ళు పాలనతోనే ఎన్నికలకు రెడీ కావాలి అన్న మాట. అంటే ఏడాదిన్నర విలువైన కాలాన్ని ఆయన త్యాగం చేయాలన్నమాట. పొరుగున ఉన్న తెలంగాణా సర్కార్ కి ఆ సమయానికి ఏడాది కాలమే మిగిలి ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అంటున్నారు.
అంతా ఓకేనా…?
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మోడీ సర్కార్ జమిలి నిర్ణయానికి జై కొట్టే పరిస్థితే కనిపిస్తోంది అంటున్నారు. జమిలి ఎన్నికల మీద జగన్ సీఎం అయిన కొత్తల్లో ఒక మీటింగ్ ఢిల్లీలో జరిగితే నాడే ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక కేసీయార్ నుంచి కేటీయార్ వరకూ తరచూ జమిలి ఎన్నికలు వస్తున్నాయి అని చెబుతూనే ఉన్నారు. అంటే వారు కూడా ప్రిప్రేర్ అయినట్లే. జగన్ గద్దెనెక్కిన దగ్గర నుంచి దిగిపోవాలని తెగ గోల పెడుతున్న చంద్రబాబుకు జమిలి మాట వింటేనే పరవశంగా ఉంటుంది. ఆయన అందరి కంటే ముందే మద్దతు అంటూ జై కొడతారు. తెలంగాణాలో కాంగ్రెస్ నేతలదీ ఇదే తీరు. మొత్తానికి జమిలి ఎన్నికల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు ఒక స్పష్టత ఉంది అంటున్నారు.
అదే ప్రమాణమా ….?
జమిలి ఎన్నికలు అంటే రాష్ట్రాలూ కేంద్రం కలసి ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలి. మరి బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికలు జరుగుతున్నాయి. 2022 అంటే వాటికి అట్టే సమయం కూడా లేదు. మరి ఏడాది రెండేళ్ళ వ్యవధిలో ఎన్నికలు అంటే వారు సిద్ధమవుతారా అన్నదే ప్రశ్న. అయితే దీనికి లా కమిషన్ ఏమి సిఫార్సులు చేస్తుంది అన్నదే ఆసక్తికరంగా ఉంది. జమిలి ఎన్నికలు అంటే దేశంలో మొత్తం 28 రాష్ట్రాలకు ఒకే సారి కేంద్రంలో కలిపి పెడతారా లేక 2017 నుంచి అధికారంలో ఉన్న రాష్ట్రాలను కలుపుకుని జమిలి ఎన్నికలు పెడతారా అన్నది ఒక చర్చగా ఉంది. తొలి విడతలో సగం రాష్ట్రాలతో జమిలి ఎన్నికలు అన్న ప్రతిపాదన చేస్తే కనుక ఏడాది రెండేళ్ళ లోపు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మినహాయింపు ఉంటుంది. అన్న చర్చ కూడా ఉంటుంది. మరి వాటి పదవీకాలం మధ్యలో ముగిస్తే 2027 నాటికి ఎలా కలుపుతారు అన్నది కూడా ఆలోచించాలి. మొత్తానికి జమిలి ఎన్నికల విషయంలో దేశంలో ఎలా ఉన్నా ఏపీలో మాత్రం గట్టిగా రెండేళ్ళు కూడా లేదు ముచ్చట అంటున్నారు. సో రెడీ అయిపోవడమే.