షిఫ్టింగ్ కి కొత్త ముహూర్తం? డిసైడ్ అయినట్లేనట
విశాఖ అంటే ఎందుకో జగన్ కి మోజు తగ్గడంలేదు. ఆరు నెలల క్రితం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ అదే దూకుడుతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు [more]
;
విశాఖ అంటే ఎందుకో జగన్ కి మోజు తగ్గడంలేదు. ఆరు నెలల క్రితం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ అదే దూకుడుతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు [more]
విశాఖ అంటే ఎందుకో జగన్ కి మోజు తగ్గడంలేదు. ఆరు నెలల క్రితం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ అదే దూకుడుతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ అధికార వికేంద్రీకరణ బిల్లుని పాస్ చేయించుకున్నారు. ఇక శాసనమండలిలో బిల్లుకు బ్రేక్ పడితే ఏకంగా మండలి రద్దుకే సిఫార్స్ చేశారు. ఈమధ్యలో స్థానిక ఎన్నికలను పూర్తి చేసి వేసవికి చలో విశాఖ అనుకున్నారు. అయితే కధ అక్కడే అడ్డం తిరిగింది. కరోనా రూపంలో లోకల్ బాడీ ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి.
అదే కసరత్తులో….
విశాఖ రాజధాని అని మైండ్ లో ఒక్కసారి ఫిక్స్ అయిన జగన్ ఇక అటే చూస్తున్నారని అంటున్నారు. విశాఖ రాజధానిని చేసేందుకు గాను ముందస్తు కసరత్తు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. తన సన్నిహితుడు విజయసాయిరెడ్డి ద్వారా జరగాల్సిన పనులను జరిపించేస్తున్నారని అంటున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి మకాం వేసి మరీ ఆ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకువస్తున్నారని అంటున్నారు. కరోనా ఓ వైపు ఉండగానే విజయసాయిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. మరో వైపు రాజధాని కోసం భవనాలతో సహా ఇతర పనులను ముమ్మరం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఇలా కరోనా వేళ కూడా దూకుడుగా తిరుగుతూంటే టీడీపీ తమ్ముళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఈ హడావిడి అంతా రాజధాని తరలింపు కోసమేనని కూడా ఆరోపిస్తున్నారు.
కొత్త ముహూర్తం….
ఇప్పటిదాకా విశాఖను రాజధాని తరలించేందుకు అనేక ముహూర్తాలు వచ్చాయి. వెళ్లాయి. తాజాగా మే 28న విశాఖకు రాజధాని షిఫ్ట్ చేయడానికి ముహూర్తంగా వైసీపీ అధినాయకుడు నిర్ణయించారని అంటున్నారు. ఇది వైసీపీ వర్గాల్లో కూడా చర్చకు దారి తీస్తోంది. ఆ రోజున మంచి ముహూర్తంగా వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. ఈసారి గురి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సచివాలయాని విశాఖకు తరలించాల్సిందేనని ఆలోచిస్తున్నారుట. దాని కోసమే మ సచివాలయ ఉద్యోగులను కూడా ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మే 3వ తేదీతో లాక్ డౌన్ పూర్తి అవుతుందని, ఆ తరువాత తరలింపు ప్రక్రియ ఊపందుకుంటుందని అంటున్నారు.
జరిగేనా….?
ఉగాదికి విశాఖకు సచివాలయం తరలింపు అన్నారు. ఆ తరువాత ఏప్రిల్ 28 అన్నారు. ఇపుడు మే 28 అంటున్నారు. ఈ ముహూర్తాకైనా రాజధాని తరలింపు సాధ్యపడుతుందా అన్నది ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే కరోనా వైరస్ ఇప్పటికే దేశంలో విస్తరించి ఉంది. అది మే 3 నాటికి తగ్గుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అదే సమయంలో ఒక వేళ కేసులు నెమ్మదించినా సాధారణ పరిస్థితి రావాలంటే మరి కొన్ని నెలలు పట్ట అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట. మరి వైసీపీ సర్కార్ మాత్రం మే నెలాఖరు నాటికి విశాఖ రావాలని ముహూర్తం పెట్టేసుకుంది. ఏది ఏమైనా విశాఖ వెళ్ళాల్సిందేనని అంటోంది. ఓ వైపు కరోనా మహమ్మారి ఉండగానే ఎలా రాజధానిని విశాఖకు మారుస్తారని విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ నిలదీస్తున్నారు. స్వార్ధ రాజకీయాలు మాని కరోనా కట్టడికి గట్తి ప్రయంత్నాలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి వైసీపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో చూడాలి.