ఆకేపాటికి ఆ పదవిని జగన్ రిజర్వ్ చేశారా?

వైసీపీ చీఫ్ జగన్ తన వెన్నంటి ఉన్న వారికి ఏదో రకంగా పదవి దక్కేలా చేస్తారు. గత ఎన్నికల్లో అనేక మందికి జగన్ టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. వారు [more]

Update: 2020-09-02 09:30 GMT

వైసీపీ చీఫ్ జగన్ తన వెన్నంటి ఉన్న వారికి ఏదో రకంగా పదవి దక్కేలా చేస్తారు. గత ఎన్నికల్లో అనేక మందికి జగన్ టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. వారు తన వెన్నంటే ఉన్నప్పటికీ సమీకరణాలు కుదరక, అప్పటికే హామీలు ఇచ్చి ఉండటంతో వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో వారు మౌనంగానే వైసీపీ విజయానికి కృషిచేశారు. అందులో రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఒకరు. ఈయన తొలి నుంచి వైఎస్ జగన్ ను నమ్మకంగా అంటిపెట్టుకునే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు.

జగన్ వెంటే నడిచి….

2009లో రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి గెలుపొందారు. వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ చెంతకు చేరారు. రాజీనామా చేసి 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి జగన్ టిక్కెట్ ఇచ్చినా విజయం సాధించలేదు. 2019 ఎన్నికల సమయానికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డిని జగన్ పక్కన పెట్టారు.

ఆశించిన పదవులు….

ిఇక అధికారంలోకి రాగానే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆకేపాటి స్వతహాగా వెంకటేశ్వరస్వామి భక్తుడు కావడంతో ఆ పదవిని ఆశించారు. అయితే వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఇవ్వడంతో ఆ పదవి కూడా ఆకేపాటికి మిస్ అయింది. ఇక ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. సీమ నుంచి చల్లా రామకృష్ణారెడ్డి, ఇక్బాల్ కు ఇవ్వడంతో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. దీంతో ఆయన తనకు ఇక పదవి దక్కదేమోనన్న ఆందోళనలో ఉన్నారు.

చివరకు ఫైనల్…..

కానీ జగన్ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి జగన్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని రిజర్వ్ చేసినట్లు తెలిసింది. జగన్ కు తమ కుటుంబీకుల నుంచి వత్తిడి వచ్చినా ఆకేపాటికే ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పదవి కోసం ఎవరూ తన వద్దకు రావద్దని ఆకేపాటికి ఫైనల్ చేశానని చెప్పడంతో ఆయన వర్గం ఖుషీగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు తిరిగి జరిగిన వెంటనే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ కానున్నారు. సో.. తనకే పదవి దక్కలేదన్న ఆకేపాటికి ఇటీవల జగన్ నుంచి తీపి కబురు అందినట్లు సమాచారం.

Tags:    

Similar News