akepati : ఏడేళ్ల నిరీక్షణ అనంతరం…?
రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం. వెయిట్ చేస్తేనే పదవులు దక్కుతాయి. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఇందుకు ఉదాహరణ. రాజంపేట మాజీ ఎమ్మెల్యేగా ఆకేపాటి [more]
;
రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం. వెయిట్ చేస్తేనే పదవులు దక్కుతాయి. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఇందుకు ఉదాహరణ. రాజంపేట మాజీ ఎమ్మెల్యేగా ఆకేపాటి [more]
రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం. వెయిట్ చేస్తేనే పదవులు దక్కుతాయి. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఇందుకు ఉదాహరణ. రాజంపేట మాజీ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా, నమ్మకంగా ఉన్నారు. 2009లో వైఎస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వడంతో రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణం తర్వాత ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి జగన్ చెంత చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలుపొందారు.
రాజంపేట నుంచి…
2014లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి జగన్ మళ్లీ రాజంపేట టిక్కెట్ ఇచ్చినా గెలుపొంద లేక పోయారు. ఆ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకైక సీటు రాజంపేట మాత్రమే. రాజంపేటలో టీడీపీ గుర్తుపైన గెలిచిన మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి కి జగన్ టిక్కెట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన పదవి కోసం ఓపికగా ఎదురు చూస్తుండి పోయారు.
జగన్ కు సన్నిహితుడిగా…
ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి తొలి నుంచి జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగారు. రాజంపేటలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున్ రెడ్డి ఉన్నప్పటికీ అనేక నిర్ణయాల్లో ఈయనదే కీలక పాత్ర గా ఉంది. ఆకేపాటి, మేడాల మధ్య విభేదాలు వచ్చాయని కూడా చెబుతున్నారు. రెండు గ్రూపులుగా వైసీపీ రాజంపేటలో విడిపోయింది. జగన్ కు ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి సన్నిహితుడు కావడంతో జిల్లా నేతలు కూడా ఏం చేయలేకపోతున్నారు.
జడ్పీ ఛైర్మన్ గా….
అయితే తాజాగా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డిని జగన్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఒంటిమిట్ట జడ్పీటీసీగా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. ఏడేళ్లుగా ఆయన పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్లకు నిరీక్షణ ఫలించింది. జడ్పీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆకేపాటి వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన జడ్పీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.