తేడా కొడితే తంబిలిద్దరూ అవుట్…?

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడే కూటమికి ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్ మిగిలిన కొన్ని పార్టీలతో కూటమితో కలసి ముందుకు వెళుతున్నాయి. అధికార అన్నాడీఎంకే సయితం [more]

Update: 2020-09-02 18:29 GMT

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడే కూటమికి ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్ మిగిలిన కొన్ని పార్టీలతో కూటమితో కలసి ముందుకు వెళుతున్నాయి. అధికార అన్నాడీఎంకే సయితం కూటమి కట్టేసింది. బీజేపీ, పీఎంకే, డీఎండీకేలను కలుపుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. తమిళనాడులో వివిధ సంస్థలు జరిపిన సర్వేలన్నీ ప్రతిపక్ష డీఎంకేకు అనుకూలంగా ఉండటంతో అధికార పార్టీలో కలవరం బయలుదేరింది.

సర్వేలు బోగస్ అంటున్న……

అయితే ఎన్నికల సమయానికి పరిస్థితుల్లో మార్పు వస్తుందని పళనిస్వామి, పన్నీర్ సెల్వం అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే అత్యధిక స్థానాలను సాధించింది. అదే రిజల్ట్ శాసనసభ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలే తిరిగి తమకు వస్తాయని డీఎంకే చెబుతోంది.

సీట్ల పంపకాల విషయంలో………

అయితే 234 స్థానాల్లో కనీసం 180 స్థానాలు తమకు కావాలని అన్నాడీఎంకే కోరుకుంటుంది. అధికార పార్టీ కావడం, అన్ని చోట్ల తమకు అభ్యర్థుల నుంచి వత్తిడి ఎదురవుతుండటంతో తమకు అధిక స్థానాలు కావాలని చెబుతోంది. మొత్తం 234 స్థానాల్లో తాము 180 స్థానాలను పోటీ చేస్తే మిగిలిన స్థానాల్లో ఇరవై స్థానాలను బీజేపీకి ఇవ్వాలని పన్నీర్ సెల్వం, పళనిస్వామి డిసైడ్ చేశారు. పీఎంకేకు కూడా ఇరవై స్థానాలను కేటాయించనున్నారు.

సర్దుబాటు అవుతుందా?

దీంతోపాటు విజయకాంత్ డీఎండేకేకు కేవలం ఐదుస్థానాలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనికి డీఎండీకే అంగీకరించే ప్రస్తక్తి లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమకు కనీసం నలభై స్థానాలను కేటాయించాలని డీఎండీకే గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకేలోనూ పన్నీర్ సెల్వం వర్గం తమకు 90 స్థానాలను కేటాయించాలని కోరుతుంది. 180 స్థానాల్లో చెరిసగం పంచుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం పళనిస్వామికి సూచిస్తుంది. దీనికి పళనిస్వామి అంగీకరించరంటున్నారు. దీంతో అధికార అన్నాడీఎంకేలోనే విభేదాలు తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీట్ల పంపకంలోనే తేడా కొట్టేటట్లు కన్పిస్తుంది.

Tags:    

Similar News