షట్టర్ క్లోజ్ చేయాల్సిందేనా?

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని డెవ‌ల‌ప్ చేయాలని ఒక‌ప‌క్క అధినేత చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే, అస‌లు పార్టీకి ఫ్యూచ‌ర్ ఉంటుందో? [more]

Update: 2020-03-03 15:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని డెవ‌ల‌ప్ చేయాలని ఒక‌ప‌క్క అధినేత చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే, అస‌లు పార్టీకి ఫ్యూచ‌ర్ ఉంటుందో? ఉండదోన‌ని మ‌రోప‌క్క నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. దీంతో అస‌లు పార్టీలో కొన‌సాగాలా? లేక త‌మ దారి తాము చూసుకోవాలా? అని నాయ‌కులు త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నట్టు తెలుస్తోంది. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ ప‌రిస్థితి ఇలానే ఉండ‌డంతో పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీస్తోంది. చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప‌రిస్థితి ఇలానే ఉంది.

రెండేళ్ల పాటు….

అమ‌ర్‌నాథ్ రెడ్డికి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. అయితే, ఆయ‌న ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉండ కుండా త‌న‌కు ఎక్కడ అవ‌కాశం వ‌స్తే అక్కడకు జంప్ చేయ‌డం ఆయ‌న‌కు తీవ్రమైన మైన‌స్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2009 వ‌ర‌కు ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడినా ఆయ‌న విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ప‌ల‌మనేరు నుంచి అమర్ నాధ్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న వైసీపీని విడిచి పెట్టి టీడీపీలో చేరారు. అంతేకాదు, జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శలు చేశారు. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నా రు. రెండేళ్లు మంత్రిగా చ‌క్రం తిప్పారు.

తనకు పోటీయే కాదని…..

అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన అమ‌ర్‌నాథ్‌రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసిన వెంక‌ట్ గౌడ్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. ఎలాంటి రాజ‌కీయ చ‌రిత్రా లేని వెంక‌ట్ గౌడ్ అస‌లు త‌న‌కు పోటీనే కాద‌ని అమ‌ర్‌నాథ్‌రెడ్డి అనుకున్నారు. కానీ, వైసీపీ సునామీలో కొట్టుకుపోయారు. వాస్తవానికి ఆయ‌న ప‌ల‌మ నేరును త‌నకు కంచుకోట‌గా మార్చుకోవాల‌ని భావించారు. అయితే, అనూహ్య ఓట‌మితో మాన‌సికంగా దెబ్బతిన్నారు. అదే చంద్రబాబు పిలుపుతో టీడీపీలోకి రాక‌పోయి ఉంటే ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్‌లో సీటైనా ద‌క్కి ఉండేద‌ని కానీ, తాను త‌ప్పు చేశాన‌ని ఇప్పుడు వ‌గ‌రుస్తున్నార‌ట‌.

వెళ్లలేక…ఉండలేక….

ఈ నేప‌థ్యంలో మునిగిపోయే టీడీపీని బాగు చేయ‌లేక‌, వైసీపీలోకి వెళ్తాదామంటే పార్టీ నుంచి త‌న‌కు సానుకూల సంకేతాలు రాక‌పోవ‌డం వ‌ల్ల అమ‌ర్‌నాథ్‌రెడ్డి సైలెంట్ అయిపోయారు. బెంగ‌ళూరులో త‌న వ్యాపారాల్లో నిమ‌గ్నమ‌య్యారు. కానీ, రాజ‌కీయంగా ప‌ల‌మ‌నేరులో వెంక‌ట‌గౌడ్ దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా త‌న వ్యూహం పారేలా లేద‌ని ఇప్పుడు కిం కర్తవ్యమ‌ని అమ‌ర్‌నాథ్‌రెడ్డి చింతిస్తున్నా ర‌ని అంటున్నారు. ఇటు టీడీపీలో ఉండ‌లేక‌.. అటు వైసీపీలోకి వెళ్లే మార్గం కూడా క‌నిపించ‌క ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఇటు టీడీపీలోను అటు వైసీపీలోనూ అమ‌ర్‌నాథ్‌రెడ్డి న‌మ్మకం కోల్పోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News