రెడ్ల రాజకీయానికి కాలం చెల్లిందా?

సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక బీసీ చేతిలో తన ఓటమిని నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే [more]

;

Update: 2019-12-30 02:00 GMT

సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక బీసీ చేతిలో తన ఓటమిని నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే ఆయన ఆరు నెలల నుంచి పలమనేరు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. బెంగళూరులోని తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఇటీవల చంద్రబాబు చిత్తూరు పర్యటనలో మాత్రం అమర్ నాధ్ రెడ్డి కన్పించారు. అంతే తప్ప ఆయన అంతకు ముందు, ఆ తర్వాత జిల్లాలోనే లేకపోవడం విశేషం. అసలు అమర్ నాధ్ రెడ్డి ఎందుకింత ఫీలవుతున్నారు?

ఒక పార్టీలో గెలిచి…..

అమర్ నాథ్ రెడ్డి తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు. 2004లో టీడీపీ నుంచి పలమనేరు నియోజకవర్గం నుంచి ఓటమి పాలయి 2009లో గెలిచారు. అయితే ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పలమనేరు నుంచి గెలిచినా ఎక్కువ కాలం పార్టీలో ఉండలేదు. వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరిపోయారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

సంబరపడినా…..

ఈ నేపథ్యంలో పలమనేరు వైసీపీ అభ్యర్థి వెంకటేశ్ గౌడ్ అని తెలియడంతో సంబరపడ్డారు అమర్ నాధ్ రెడ్డి. తనకు గౌడ్ పోటీయే కాదని భావించారు. కానీ ఈ ఎన్నికల్లో వెంకటేశ్ గౌడ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు అమర్ నాధ్ రెడ్డి. దీంతో ఆయనకు రాజకీయంపైన, ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంపైనే విరక్తి పుట్టిందంటున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన అమర్ నాధ్ రెడ్డిని పలమనేరు ప్రాంత టీడీపీ నేతలు కలవగా తాను ఇప్పట్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేనని నిర్మొహమాటంగా చెప్పేశారట. దీంతో అమర్ నాధ్ రెడ్డి వైఖరిపై పార్టీ అధినేతకు కొందరు ఫిర్యాదు చేశారట.

దూరంగా అందుకే…?

అమర్ నాధ్ రెడ్డి టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లడం, మళ్లీ వైసీపీలో గెలిచి టీడీపీ లోకి వెళ్లడంతో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారన్నది వాస్తవం. తాము ఓటేసి గెలిపించిన ఏ పార్టీలో ఆయన ఉండకపోవడం నిలకడలేని మనస్తత్వానికి నిదర్శనంగా చూశారు. ఇప్పుడు పలమనేరులో రెడ్డి రాజ్యాన్ని వెంకటేశ్ గౌడ్ దెబ్బతీశారంటున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా సామాన్యుడి చేతిలో ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేకనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా చెప్పారట. కొద్ది రోజుల తర్వాత తిరిగి అమర్ నాధ్ రెడ్డి యాక్టివ్ అవుతారని చెబుతున్నారు.

Tags:    

Similar News