Ambati : అంబటి ఈసారి కూడా బయటపడాలంటే?

వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో కష్టాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందడం కూడా కష్టమేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అంబటి రాంబాబు వైసీపీ లో కీలక [more]

Update: 2021-10-01 15:30 GMT

వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లిలో కష్టాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందడం కూడా కష్టమేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అంబటి రాంబాబు వైసీపీ లో కీలక నేత. గత ఎన్నికల్లో ఆయన అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఓడించారు. ఈసారి అక్కడ టీడీపీ క్రమంగా బలోపేతం అవుతుందంటున్నారు. మరోవైపు వైసీపీలో నెలకొన్న విభేదాలు పార్టీని ముంచేట్లు ఉన్నాయంటున్నారు.

టీడీపీకి అననుకూలత…

సత్తెన పల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ టీడీపీ కంటే ఇతర పార్టీలకే గెలుపు అవకాశాలున్నాయి. ఇక్కడ పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది కేవలం మూడు సార్లు మాత్రమే. కాంగ్రెస్ అత్యధికంగా ఐదుసార్లు విజయం సాధించింది. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వై. వెంకటేశ్వర్ రెడ్డి రెండుసార్లు వరసగా గెలిచారు.

టీడీపీలో లుకలుకలు…

2019 ఎన్నికల్లోనూ అంబిటి రాంబాబు సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల మెజారిటీతోనే విజయం సాధించారు. కోడెల శివప్రసాద్ మరణంతో కొంత సానుభూతి అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. కోడెల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోవడంతో పార్టీ ఇంతవరకూ బలోపేతం కాలేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇటు కోడెల శివరాంతో పాటు అటు రాయపాటి రంగారావు కూడా పోటీ పడుతున్నారు.

వైసీపీలోనూ వర్గాలు….

ఇక వైసీపీ లో అంబటి రాంబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయి. ఎమ్మెల్యే అంబటి రాంబాబుపైనే కొందరు వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. ఇక అంబటి రాంబాబు పెద్దగా నియోజకవర్గంలో ఉండరు. ఆయన సోదరుడు పెత్తనమే నడుస్తుంది. దీంతో ఇక్కడ వైసీపీలో అసంతృప్తులు కూడా ఉన్నాయి. రెండు పార్టీల్లో అసంతృప్తులకు కొదవలేదు. ఎన్నికల సమాయానికి ఎవరు దీని నుంచి బయటపడితే వారిదే విజయంగా చెప్పుకోవాలి.

Tags:    

Similar News