అంబటికి ఇంటిపోరు ఇంతింత కాదటగా?
సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు వ్యతిరేకవర్గం బలంగా ఉందా? సొంత పార్టీ నేతల నుంచి అంబటి రాంబాబుకు సెగ తగులుతుతందా? అంటే అవుననే అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టిక్కెట్ [more]
సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు వ్యతిరేకవర్గం బలంగా ఉందా? సొంత పార్టీ నేతల నుంచి అంబటి రాంబాబుకు సెగ తగులుతుతందా? అంటే అవుననే అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టిక్కెట్ [more]
సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు వ్యతిరేకవర్గం బలంగా ఉందా? సొంత పార్టీ నేతల నుంచి అంబటి రాంబాబుకు సెగ తగులుతుతందా? అంటే అవుననే అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టిక్కెట్ ఇచ్చే సమయంలోనే వైసీపీ నేతలు కొందరు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అంబటి రాంబాబు స్థానికేతరుడని ఆయనకు టిక్కెట్ ఎలా ఇస్తారని, ఆయనకు ఇస్తే 2014 రిజల్ట్ రావడం ఖాయమని కూడా కొందరు నేతలు పనిగట్టుకుని వైసీపీ సీనియర్ నేతలకు ఫిర్యాదు చేశారు.
వైసీపీలోనే వ్యతిరేక వర్గం…..
అయినా జగన్ అంబటి రాంబాబుకే టిక్కెట్ ఇచ్చారు. చివరకు అంబటి రాంబాబు స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయినా అంబటి రాంబాబు సొంతపార్టీలోని తన ప్రత్యర్థి వర్గంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు. అంబటి రాంబాబును వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతల్లో అన్నీ సామాజికవర్గాలకు చెందిన నేతలున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత ఒకరు అంబటి రాంబాబు వ్యతిరేక వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. దీంతో తమ పార్టీ అధికారంలో ఉందని వారు అంబటి రాంబాబును లెక్క చేయడం లేదంటున్నారు.
వ్యతిరేక వర్గం సీనియర్ నేతలతో……
నేరుగా వైసీపీ సీనియర్ నేతలతో టచ్ లో ఉంటూ సత్తెనపల్లిలో తమ పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో అంబటి రాంబాబు వారిని తొక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ కేసును వాళ్లే హైకోర్టులో దాఖలు చేయడం విశేషం. సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు అంబటి రాంబాబుతో సహా మరికొందరి వైసీపీ నేతలపై హైకోర్టులో వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
సోదరుడి హవా కూడా కారణం…..
దీంతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు సోదరుడు హవా ఎక్కువ యిందంటున్నారు. అంబటి రాంబాబు నియోజకవర్గానికి తక్కువగా వస్తుండటంతో ఆయన సోదరుడే నియోజకవర్గంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా వైసీపీలో అంబటికి వ్యతిరేకత రావడానికి కారణమంటున్నారు. అయితే కొందరు కావాలనే పనిగట్టుకుని తనపై దుష‌్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు నిదానంగా తెలుస్తాయని అంటున్నారు. అక్రమ మైనింగ్ కు ప్రయత్నించి విఫలమయిన వారే తనపై కేసు వేశారంటున్నారు. మొత్తం మీద అంబటి రాంబాబుకు సత్తెనపల్లి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే సెగ బాగానే ఉందని తెలుస్తోంది.