అంబటి ఆటాడేసుకున్నారే
అసెంబ్లీ సమావేశాల్లో వైసిపి ఎమ్యెల్యే అంబటి రాంబాబు విపక్ష నేత పై విసిరిన చెణుకులు సభలో నవ్వులు పూయించాయి. చక్కటి వాగ్దాటి తో ప్రసంగించే అంబటి రాంబాబు [more]
;
అసెంబ్లీ సమావేశాల్లో వైసిపి ఎమ్యెల్యే అంబటి రాంబాబు విపక్ష నేత పై విసిరిన చెణుకులు సభలో నవ్వులు పూయించాయి. చక్కటి వాగ్దాటి తో ప్రసంగించే అంబటి రాంబాబు [more]
అసెంబ్లీ సమావేశాల్లో వైసిపి ఎమ్యెల్యే అంబటి రాంబాబు విపక్ష నేత పై విసిరిన చెణుకులు సభలో నవ్వులు పూయించాయి. చక్కటి వాగ్దాటి తో ప్రసంగించే అంబటి రాంబాబు మహిళలపై అత్యాచారాలు ,హత్యలపై ఎపి సర్కార్ తీసుకువచ్చిన కొత్త దిశ చట్టంపై జరిగిన చర్చలో పాల్గొంటూ మాజీ సిఎం ను ఒక రేంజ్ లో ఉతికేశారు. చంద్రబాబు కి ఇంగ్లిష్ రాదని చెప్పింది ఎవరని ఆయన బిల్ క్లింటన్ నుంచి బిల్ గేట్స్ వరకు అంతా ప్రశంసించారని గుర్తు చేస్తూ పూర్తి వెటకారం మొదలు పెట్టేశారు. సెటైర్లు విసరడంలో పెట్టింది పేరైన అంబటి రాంబాబు సభలో మంత్రి కొడాలి నాని, అచ్చెన్నాయుడు చంద్రబాబు ల వ్యాఖ్యలపై తనదైన శైలిలో పంచ్ లు దంచి కొట్టేశారు.
వచ్చింది బట్లర్ ఇంగ్లిష్ …
చంద్రబాబు హైదరాబాద్ లో ఒక సందర్భంలో మాట్లాడిన ఇంగ్లిష్ ను వ్యంగ్యంగా ప్రస్తావించారు అంబటి. ఎవరీ ధింగ్ మనవాళ్ళు బ్రీఫ్ డ్ మీ అంటూ ఆయన చంద్రబాబు మాట్లాడింది దేశమంతా సంచలనం సృష్ట్టించిందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. బాబు కి బట్లర్ ఇంగ్లిష్ వచ్చని ఆయనకు ఇంగ్లిష్ రాదని చెప్పడం సరికాదన్నారు. ఆయన ఇంగ్లిష్ చూసి దిమ్మతిరిగి తెలంగాణ వారంతా సన్మానం చేసేందుకు సిద్ధమైతే రాత్రికి రాత్రి చాప చుట్టుకుని అమరావతిలో వచ్చి పడ్డారని అంటూ మాటల తో విపక్ష నేతను తూట్లు పొడిచారు. మందు ధరలు పెరిగితే చంద్రబాబు కి ఎందుకు బాధ అని తాగుడు మానిపించడమే జగన్ లక్ష్యమని దశలవారీగా మద్యనిషేధం తప్పదన్నారు అంబటి రాంబాబు.
కాంట్రాక్టర్లకు వరంగా….
ఇసుక లభ్యం కావడం లేదని వరదల సమయంలో ఇలాగే అల్లరి చేశారని గతంలో టిడిపి నేతల జేబుల్లోకి వెళ్లిన సొమ్ము ఇప్పుడు సర్కార్ ఖజానాకు జమ అవుతుండటాన్ని చంద్రబాబు భరించలేక పోతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గతంలో సాగునీటి ప్రాజెక్ట్ ల పై శ్వేత పత్రం ఇస్తూ 17 వేలకోట్ల రూపాయలు ఉంటే మొత్తం ప్రాజెక్ట్ లన్ని పూర్తి అవుతాయని ప్రకటించిన చంద్రబాబు సర్కార్ 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేక పోయిందని కాంట్రాక్టర్ ల జేబులు నింపి కమిషన్ లకు కక్కుర్తి పడి దోచుకుందని దుమ్ము దులిపేలా అంబటి రాంబాబు ప్రసంగించిన తీరు స్పీకర్, ముఖ్యమంత్రి సహా వైసిపి పక్షం అందరిలో నవ్వుల వానే కురిపించింది.