ఆదుకునేది ఈయనొక్కడేనా? ఎవరూ లేరా?

నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడే వాడే నిజమైన స్నేహితుడు. రాజకీయాల్లో అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాడే సిసలైన నేత. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు [more]

Update: 2021-02-14 02:00 GMT

నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడే వాడే నిజమైన స్నేహితుడు. రాజకీయాల్లో అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాడే సిసలైన నేత. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు ఇరవైై మందికి పైగా మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీడియా తో మాట్లాడటం జరగదు. ఇక మంత్రుల్లో ఒకరిద్దరు మినహా పార్టీపై విమర్శలు వచ్చినప్పుడు ఎవరూ స్పందించరు. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాల్లో మాత్రం అంబటి రాంబాబు ఒక్కరే పార్టీ ప్రతినిధిగా స్పందిస్తున్నారు.

ఎమ్మెల్యే మాత్రమే…..

నిజానికి అంబటి రాంబాబు ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధం లేదు. తన సత్తెన పల్లి నియోజకవర్గంలో సర్పంచ్ పదవులు, వార్డు మెంబర్లను గెలిపించుకుంటే సరిపోతుంది. కానీ అంబటి రాంబాబు మాత్రం గత కొన్ని రోజులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విరుచుకుపడటంలో ముందుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన స్పందించడంలో అర్థముంది.

నిత్యం మీడియా ముందుకు….

కానీ అంబటి రాంబాబు ప్రతి రోజూ మీడియా ముందుకు వచ్చి నిమ్మగడ్డ, చంద్రబాబులపై చెడుగుడు ఆడుతున్నారు. నిమ్మగడ్డనయితే ప్రతిరోజూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. నిజానికి వైసీపీ క్యాడర్, అభిమానుల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాన్ని అంబటి రాంబాబు చేస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ వెంటనే వైసీపీ సోషల్ మీడియాలోకి వెళ్లిపోతున్నాయి. ఒక్క అంబటి రాంబాబు తప్పించి 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం.

అంత మంది ఉన్నా….?

మాట్లాడే వారు లేక కాదు. విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్లు వైసీపీలో అనేక మంది ఉన్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అంబటి రాంబాబుకే బాధ్యతలను అప్పగంచినట్లు కనపడుతుంది. అయితే ఇదంతా వచ్చే మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాదించుకోవడం కోసమేనా? అన్న చర్చ జరుగుతున్నప్పటికీ.. వైసీపీ క్యాడర్ లో ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం హీరో అనే చెప్పుకోవాలి. అంబటి రాంబాబు సరైన సమయంలో పార్టీని ఆదుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News