Amith shah : ఇక షా వంతు అట… ఆయనే సూపర్ అట
ఈసారి లోక్ సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం లేదు. అయితే మోదీ నేతృత్వంలోనే 2024 లోక్ సభ ఎన్నికలకు [more]
;
ఈసారి లోక్ సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం లేదు. అయితే మోదీ నేతృత్వంలోనే 2024 లోక్ సభ ఎన్నికలకు [more]
ఈసారి లోక్ సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం లేదు. అయితే మోదీ నేతృత్వంలోనే 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మోదీ ఇమేజ్ తోనే మరోసారి ఎన్నికల్లో గెలిచి మూడోసారి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలన్నది బీజేపీ ఆలోచన. సంఘ్ పరివార్ ఉద్దేశ్యం కూడా అదే. అందుకే ముందు మోడీని ఉంచి ఎన్నికల గోదాలోకి దిగాలని నిర్ణయించింది.
మూడోసారి వస్తే….
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ కొన్ని నెలలు మాత్రమే ప్రధానిగా కొనసాగుతారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రధానిగా చేశారు. ఆయన కంటే ఎక్కువగా మరికొద్ది నెలలు చేసి మోదీ పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మోదీ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఆయన వయసే. ఏడు పదులు వయసు దాటడంతో బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం పక్కకు తప్పుకోవాల్సిందే.
షా పేరును….
మోదీ తర్వాత ప్రధానమంత్రి పదవికి అమిత్ షా పేరు దాదాపుగా ఖరారయినట్లే. అమిత్ షాను ప్రధాని పదవిలో కూర్చోబెట్టేందుకు ఆర్ఎస్ఎస్ వంటి సంఘ్ పరివార్ సంస్థలు కూడా అంగీకరించాయి. మోదీ, అమిత్ షా నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించగలిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్టీని విజయ పంథాన నడిపించడంలో వీరిద్దరు కీలక భూమికను పోషించారు.
మోదీ అంగీకారం….
అందుకే వచ్చే ఎన్నికలలో మోదీ నాయకత్వం వహించినా వెను వెంటనే ఆ బాధ్యతలను అమిత్ షాకు అప్పగించేందుకు మోదీ కూడా సిద్దమయ్యారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంతృప్తికరంగా లేరు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తో ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. ప్రజలకు పూర్తిస్థాయిలో సాయం చేయలేకపోయామన్న ఆవేదనను పార్టీ నేతల ముందు మోదీ వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తం మీద అమిత్ షాకు పట్టాభిషేకం చేయడానికి సర్వం సిద్ధమయింది.