Anam : సత్తా చాటుతారా? సర్దుకుపోతారా?

ఒక్కో నేత అవసరం ఒక్కొక్కరికి పడుతుంది. ఎంతో కొంత ప్రభావం ఉన్న నేతలను దూరం పెడితే అది రాజకీయ ఇబ్బందులను కలిగించదా? అవును.. ఇప్పుడు వైసీపీలో ఇదే [more]

Update: 2021-10-29 15:30 GMT

ఒక్కో నేత అవసరం ఒక్కొక్కరికి పడుతుంది. ఎంతో కొంత ప్రభావం ఉన్న నేతలను దూరం పెడితే అది రాజకీయ ఇబ్బందులను కలిగించదా? అవును.. ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆనం రామనారాయణరెడ్డి అవసరం మరోసారి పార్టీ నాయకత్వానికి వచ్చింది. నెల్లూరు వైసీపీలో విభేదాల కారణంగా పార్టీ ఇబ్బందులు పడనున్నట్లు వైసీపీ నాయకత్వం గుర్తించింది. త్వరలోనే ముఖ్మమంత్రి జగన్ ఆనం రామనారాయణరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

ఈ ఎన్నికల్లో….

నెల్లూరు కార్పొరేషన్ కు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 54 వార్డులకు సంబంధించి జరగనున్న ఈఎన్నికలు వైసీపీకి సవాల్. ఇప్పటికే నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వరకూ వైసీపీదే నెల్లూరు జిల్లాలో ఆధిక్యం. అయితే ఇప్పుడు నగరపాలక సంస్థ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రతిష్టాత్మకం.

వారిద్దరిపై ఆనం వర్గీయులు…

ఈ ఇద్దరు నేతలపై ఆనం వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఆనం వివేకానందరెడ్డి ఫ్లెక్సీలను కూడా తొలగించి తమ వర్గాన్ని అణిచివేయాలని చూస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి కూడా అభిప్రాయపడుతున్నారు. గడచిన కొద్ది నెలలుగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు వ్యతిరేకంగా ఆనం, కాకాణిలు ఇద్దరూ ఏకమయ్యారంటున్నారు. వారిద్దరిని కంట్రోల్ చేయాలంటే ఈ ఎన్నికల్లో సహకరించకపోవడమే బెటర్ అని ఆనం వర్గీయులు భావిస్తున్నారు.

సహాయ నిరాకరణ చేసి….

ఆనం కుటుంబానికి నెల్లూరు టౌన్, రూరల్ నియోజకవర్గాల్లో పట్టుంది. ఆనం రామనారాయణరెడ్డి తమ వర్గాన్ని నిలుపుకునేందుకు చేేసిన ప్రయత్నాలను కూడా వీరు అడ్డుకున్నారు. దీంతో నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆనం వర్గీయులు సహాయ నిరాకరణ చేస్తారన్న టాక్ బలంగా వినపడుతుంది. ఆనం తన అసంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా బలంగా తెలియజేయాలని నిర్ణయించుకుంది. అయితే దీనిపై ఆనం రామనారాయణరెడ్డితో జగన్ స్వయంగా మాట్లాడి సమస్యను సర్దుబాటు చేస్తారని లోకల్ నాయకత్వం ఆశిస్తుంది. మరి చూడాలి ఆనం తన సత్తాను చాటాలని చూస్తారా? సర్దుకుపోతారా? అన్నది.

Tags:    

Similar News