Anandaiah : ఇదేం పోయేకాలం… ఆనందయ్య వెనక ఎవరు?
కరోనా సమయంలో గుళికలు వేసిన ఆనందయ్య కూడా ఏపీలో రాజీకీయ పార్టీ పెడతారట. బీసీల్లోని అన్ని కులాలను కలుపుకుని ప్రత్యేకంగా ఒక పార్టీ పెడతారట. అయితే ఇది [more]
;
కరోనా సమయంలో గుళికలు వేసిన ఆనందయ్య కూడా ఏపీలో రాజీకీయ పార్టీ పెడతారట. బీసీల్లోని అన్ని కులాలను కలుపుకుని ప్రత్యేకంగా ఒక పార్టీ పెడతారట. అయితే ఇది [more]
కరోనా సమయంలో గుళికలు వేసిన ఆనందయ్య కూడా ఏపీలో రాజీకీయ పార్టీ పెడతారట. బీసీల్లోని అన్ని కులాలను కలుపుకుని ప్రత్యేకంగా ఒక పార్టీ పెడతారట. అయితే ఇది ఆనందయ్యకు పుట్టిన బుద్ధికాదంటున్నారు. దీనిని వెనకుండి ఎవరో నడిపిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గం లక్ష్యంగా చేసుకుని ఆనందయ్యను ఈ రాజకీయ రొంపిలోకి కొందరు బలవంతంగా దించుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ఆయుర్వేద మందును….
రాజకీయ పార్టీ పెట్టడం తప్పు కాదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ కేవలం ఒక నియోజకవర్గం కోసమే పార్టీ పెట్టడం ఎన్నడైనా చూశామా? అంటే ఆనందయ్యనే చూపుతున్నారు. ఆనందయ్య ఎవరో 2020 వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన సాధారణ ఆయుర్వేద వైద్యుడు. ఆయుర్వేద మందు తయారీ చేసి ఆయన ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసేవారట. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పూర్వీకుల నుంచి ఆయుర్వేద మందు తయారీ సంప్రదాయంగా వస్తుంది.
సెకండ్ వేవ్ సమయంలో….
ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య పేరు రాష్ట్రమంతటా మారుమోగింది. ఆనందయ్య ఇచ్చే మందుతో కరోనా తగ్గిపోయిందన్న ప్రచారం జరిగింది. పల్స్ రేట్ కూడ పెరిగిందన్న వార్తలు రావడంతో ఆ గ్రామానికి వేల సంఖ్యలో జనం క్యూ కట్టారు. ఆనందయ్య మందును చివరకు ప్రభుత్వం కూడా గుర్తించింది. మందు తయారీకి అనుమతి ఇచ్చింది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు కూడా ఆనందయ్యకు అండగా నిలిచారు.
యాదవ సామాజికవర్గానికి…
ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేశారు. ఈ హడావిడి రెండునెలలు ఉంది. ఆ తర్వాత ఆనందయ్యను మర్చిపోయారు. అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆనందయ్య చేత కొత్త పార్టీ పెట్టిస్తే ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. అందుకే కొందరు కావాలని ఆయన చేత రాజకీయ పార్టీ ప్రకటన చేయించారంటున్నారు.