మరోసారి… ఆపరేషన్.. ఈసారి సక్సెస్ అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి. నవంబరు నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ సమావేశాల సందర్బంగా మరోసారి పార్టీ [more]

;

Update: 2020-11-10 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో జరగబోతున్నాయి. నవంబరు నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ సమావేశాల సందర్బంగా మరోసారి పార్టీ ఫిరాయింపులు చర్చనీయాంశమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమ పార్టీలో చేరతారని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జంపింగ్ ల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే నలుగురు….

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే నలుగురు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు పలికారు. 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు పార్టీని వీడటంతో 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి మిగిలారు. మరో ఒక్కరు పార్టీని వీడితే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి.

మరోసారి ఆపరేషన్….

ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందంటున్నారు. విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. విశాఖ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబులు వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే వీరి చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే లోపునే వీరి చేరిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అడ్డుకునే ప్రయత్నాలు…..

అలాగే మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేరికపైన కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. తోట త్రిమూర్తులు ఈయన చేరిక కోసం మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ వీడతారని అనుమానించిన ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు ఇచ్చారు. అయితే వారు పార్టీలోనే ఉంటారా? లేక పార్టీని వీడతారా? అన్న టెన్షన్ టీడీపీలో నెలకొంది. మరోసారి వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఎవరు పార్టీని వీడతారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News