ఆ వైసీపీ ఎమ్మెల్యేను జగన్ ప్రత్యేకంగా పిలిపించుకుని?

విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే, న‌టుడు, ర‌చ‌యిత క‌ర‌ణం ధ‌ర్మశ్రీకి ముఖ్యమంత్రి జ‌గ‌న్ క్లాస్ ఇచ్చారంటూ అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు మ‌ద్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చోటు [more]

;

Update: 2020-12-12 08:00 GMT

విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే, న‌టుడు, ర‌చ‌యిత క‌ర‌ణం ధ‌ర్మశ్రీకి ముఖ్యమంత్రి జ‌గ‌న్ క్లాస్ ఇచ్చారంటూ అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు మ‌ద్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చోటు చేసుకుంది. తొలుత ఇది ర‌హ‌స్యంగానే సాగినా.. త‌ర్వాత మీడియా మిత్రుల ఎంట్రీతో బ‌హిర్గత‌మైంది. క‌ర‌ణం ధ‌ర్మశ్రీకి జ‌గ‌న్ క్లాస్ ఇచ్చార‌ని.. నాయ‌కులు చ‌ర్చించుకున్నారు. విష‌యం ఏంటంటే.. తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో రోజూ స‌భ‌కు వ‌చ్చారు క‌ర‌ణం ధ‌ర్మశ్రీ. ఆయ‌న స‌భ‌లో త‌న‌దైన శైలిలో ప్రసంగాలు గుప్పించారు.

ఇతరులకు భిన్నంగా….

ఈ క్రమంలో మూడోరోజు.. సీఎం జ‌గ‌న్ దూర దృష్టి, బీసీల‌కు న్యాయం చేయ‌డం అనే అంశాల‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ వ‌రుస‌లో క‌ర‌ణం ధ‌ర్మశ్రీ కూడా మాట్లాడారు. అయితే. ఆయ‌న ఏకంగా అంద‌రిలాగానే జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. దీనిలో వెరైటీ ఏంటంటే.. స‌హ‌జంగా ప్రాస‌ల‌కు.. క‌విత‌ల‌కు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా దూరంగా ఉంటారు. పెద్దగా త‌మ ప్రసంగాల్లో ప్రయోగాలు చేసేందుకు ఇష్టప‌డ‌రు. విష‌యాన్ని విష‌యంగానే తేల్చేస్తారు. ప్రతిప‌క్షంపై విమ‌ర్శలు చేయ‌మంటే.. త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డ‌తారు. అయితే.. దీనికి భిన్నంగా వ్యవ‌హ‌రించారు క‌ర‌ణం ధ‌ర్మశ్రీ.

కవితలు.. ప్రార్థనలతో….

సీఎం జ‌గ‌న్‌పైనా.. ఆయ‌న బీసీల‌కు చేస్తున్న కార్యక్రమాల‌పైనా మాట్లాడుతూ.. ప్రాస‌లు, క‌విత‌ల‌తో త‌న‌దైన శైలిని నింపేసి ప్రసంగించారు. అంతే! స‌భ‌లో ఒక్కసారిగా అప్పటి వ‌ర‌కు ఉన్న వాతావ‌ర‌ణం మారిపోయి.. ఆనందం చిందులు తొక్కింది. ఇక‌, ఈ ప‌రంప‌ర‌లో క‌ర‌ణం ధ‌ర్మశ్రీ ఏకంగా స్పీక‌ర్ సీతారాంపైనా క‌విత‌లు అల్లేశారు. శ్రీకాకుళం రాసి.. స‌భాప‌తి బీసీ..! అంటూ.. క‌విత‌లు అల్లేశారు. ఇది జ‌రిగిపోయిన త‌ర్వాత స‌భ ముగిసి అంద‌రూ వెళ్లిపోయారు. అయితే క‌ర‌ణం ధ‌ర్మశ్రీని సీఎం జ‌గ‌న్ ప్రత్యేకంగా త‌న ఆఫీస్‌కు పిలిపించుకుని అభినందించార‌ట‌.

ఎమ్మెల్యేలకు శిక్షణ…..

అంతేకాదు.. ఇలా ఆక‌ట్టుకునేలా యువ ఎమ్మెల్యేల‌కు త‌ర‌గ‌తులు నిర్వహించాలంటూ.. ఆయ‌న‌కు సూచించార‌ట‌. మున్ముందు.. స‌భ అంటే కేవ‌లం అరుపులు, నినాదాలే కాకుండా ఆక‌ట్టుకునే చ‌ర్చల‌కు వేదిక కావాల‌ని.. ఆ దిశ‌గా మంచి భాషా ప‌రిజ్ఞానంపై దృష్టి పెట్టాల‌ని కూడా క‌ర‌ణం ధ‌ర్మశ్రీకి సీఎం జ‌గ‌న్ ఓ ఇర‌వై నిముషాల పాటు చ‌ర్చించార‌ట‌. ఇదీ.. సంగ‌తి!! దీనినే కొంద‌రు మంత్రులు.. క‌ర‌ణంను సీఎం పిల‌వ‌గానే ఏదో క్లాస్ ఇచ్చార‌ని.. ఆయ‌నేదో త‌ప్పు చేస్తే.. జ‌గ‌న్ మంద‌లించార‌ని అనుకున్నారు.

కరణం క్లాసులతో…..

ఇటీవ‌ల విశాఖ‌లో భూకబ్జాల ఎక్కువ అవుతున్నాయ‌ని.. ఇందులో మ‌న వాళ్లు కూడా ఉన్నారంటూ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్యలు చేయ‌డం.. దీనిపై క‌ర‌ణం ధ‌ర్మశ్రీ నొచ్చుకోవ‌డం జ‌రిగాయి. జ‌గ‌న్ ఈ విష‌యంపైనే ఆయ‌న్ను పిలిచి ఉంటార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇదే విష‌యంపై స్పీక‌ర్ జోక్యం చేసుకుని.. విష‌యం చెప్పడంతో.. అంద‌రూ ఆశ్చ‌ర్ పోయారు. మ‌రి క‌ర‌ణం ధ‌ర్మశ్రీ క్లాసులు వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఎంత వ‌ర‌కు భాషా ప‌రిజ్ఞానం నేర్పుతాయో ? చూడాలి.

Tags:    

Similar News