Ys jagan : పవన్ దూకుడు… జగన్ ఇక చెడుగుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ కు మేలు చేస్తున్నారా? ఆయన చేస్తున్న కామెంట్స్ వైసీపీకి ప్లస్ గా మారనున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. పవన్ కల్యాణ‌్ [more]

;

Update: 2021-10-03 02:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ కు మేలు చేస్తున్నారా? ఆయన చేస్తున్న కామెంట్స్ వైసీపీకి ప్లస్ గా మారనున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. పవన్ కల్యాణ‌్ గత రెండు రోజులుగా చేస్తున్న కామెంట్స్ ఇతర సామాజికవర్గాల వారిని ఆలోచనలో పడేశాయంటున్నారు. పవన్ కల్యాణ్ అన్ని కులాల పట్ల తనకు గౌరవం ఉందని చెబుతూనే, కమ్మ, కాపు సామాజికవర్గాల వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ రెండు కులాలను….

రెడ్డి సామాజికవర్గం అంటే తనకు ఇష్టమేనని చెబుతూనే జగన్ రెడ్డి అంటూ వెటకారం చేయడం వైసీపీకి సానుకూలమే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న బీసీలు ఏకమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చడానికి ఆ సామాజికవర్గం తొలి నుంచి వ్యతిరేకిస్తుంది. కాపులను బీసీల్లో చేరిస్తే ఊరుకోబోమని కూడా బీసీ సామాజికవర్గం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెచ్చరించింది.

బీసీల్లో ఐక్యతకు…

ఆ ప్రభావం గత ఎన్నికల్లో చంద్రబాబుపై పడింది. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలిచారు. దశాబ్దాలుగా టీడీపీకి అనుకూలంగా ఉన్న బీసీలు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఆ ప్రభావమే ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఇప్పడు మరోసారి పవన్ కల్యాణ్ బీసీ సామాజికవర్గంలో మంట పుట్టించారంటున్నారు. కాపులు ఐక్యంగా ఉండాలని పిలుపు నివ్వడంతో వారంతా ఒక్కటయ్యేదానికి మార్గం సుగమం అయిందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

పదవుల్లోనూ….

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేశారు. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా, స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలే ఛైర్మన్ లు, మేయర్లుగా ఉన్నారు. దీంతో వైసీీపీకి రానున్న కాలంలో బీసీ ఓటు బ్యాంకు మరింత బలపడే అవకాశముంది. పవన్ కల్యాణ్ శ్రమదానం పర్యటన జగన్ కు ఓట్ల దానం చేసినట్లయిందన్న సెటైర్లు సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News