టచ్ మీ నాట్ అంటున్న సీమాంధ్రులు ?

బీజేపీకి తెలంగాణాలో కాస్తో కూస్తో బలం అనాదిగా ఉంది. అది కూడా దశాబ్దాలుగా ఉంది. మహా నాయకులు అంతా అక్కడ నుంచే వచ్చారు. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు [more]

Update: 2020-12-12 11:00 GMT

బీజేపీకి తెలంగాణాలో కాస్తో కూస్తో బలం అనాదిగా ఉంది. అది కూడా దశాబ్దాలుగా ఉంది. మహా నాయకులు అంతా అక్కడ నుంచే వచ్చారు. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు కూడా రాష్ట్ర అధ్యక్షులను ఎక్కువగా అక్కడ నుంచే ఎంపిక చేసేవారు. ఇక అక్కడ హిందూ కార్డ్ పని చేస్తుంది. దానికి తోడు ఇతర రాష్ట్రలకు చెందిన వారు ఉత్తరాది వాళ్ళు ఉండడం చేత, మహారాష్ట్ర పొరుగున ఉండడం చేత తెలనాణా మీద కమలం ప్రభావం పడుతోంది. అయితే టీయారెస్ మీద ఈ మాదిరి విజయం సాధించడానికి కూడా బీజేపీకి ఇన్నేళ్ళ టైం పట్టింది. మరి ఇందులో ఏ అనుకూల లక్షణాలూ లేని ఏపీలో బీజేపీ గెలిచేస్తుంది, పొడిచేస్తుంది అంటే మాత్రం అది వింతా విడ్డూరంగానే చూడాలి.

గుర్రు మీద ఉన్నారుగా…?

ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీయారెస్ గెలిచిన మొత్తం 56 సీట్లలో సగానికి సగం అంటే 27 సీట్లు సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచే అన్నది ఇపుడు ఆశ్చర్యాన్ని ఆసక్తిని కలిగించే రాజకీయ విశ్లేషణగా ఉంది. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న చోట సహజంగా టీడీపీ అయినా బీజేపీ అయినా గెలుస్తుంది అనుకున్నారు కానీ చిత్రంగా గులాబీ జెండా రెపరెపలాడింది. దానికి కారణం బీజేపీ మీద సీమాంధ్రులకు గుస్సా ఉండడమే అని అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఏమీ తేల్చకుండా చేసిందని టీడీపీ అభిమానులకు, ఆ పార్టీ సామాజికవర్గానికి గుర్రు. ఇక ఏపీలో జగన్ మీదకు బీజేపీ దండెత్తి వస్తుందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏ సాయమూ లేదని వైసీపీ అభిమానులు, ఆ సామాజికవర్గం గుర్రు. తటస్థులు గా ఉన్న సీమాంధ్రులకు బీజేపీ ఎన్నికల హామీలు ఇచ్చి వాగ్దాన భంగం చేసిదని ఆగ్రహం ఉంది. అవన్నీ కలసే టీయారెస్ వైపుగా ఈ ఓట్లు వెళ్లాయని అంటున్నారు.బీజేపీ

అంత సినిమా లేదా …?

తెలంగాణాలో పటిష్టమైన నాయకత్వం ఓట్లూ ఉన్నాయి. అయినా పోరాడి బీజేపీ ఈ మాదిరి విజయాలను అందుకుంటోంది. ఏపీలో అయితే ఇప్పట్లో అలాంటి సినిమా ఏదీ ఉండబోదని తేల్చేస్తున్నారు. ఇక గట్టిగా చెబితే ఏపీలో రాజకీయం కూడా చీలిపోయి ఉంది. బలమైన సామాజిక వర్గాలు ఎక్కడికక్కడ సర్దుకున్నాయి. ఇక తటస్థులు అయిన జనాలను ఆకట్టుకోవాలంటే బీజేపీ హిందూ కార్డునో మరో దాన్నో చూపితే అసలు కుదిరే వ్యవహారం కాదని కూడాంటున్నారు. బీజేపీ ఏపీకి నిఖార్సు అయిన ‌ సాయం చేయాలి. ఆదుకోవాలి. ప్రత్యేక హోదా కాకపోయినా దానికి సరిపడే ఆర్ధిక ప్యాకేజి అయినా భారీగా ఇచ్చామని చెప్పుకోవాలి. అపుడే జనాలు చూస్తారని అంటున్నారు. లేకపోతే బీజేపీ ఎంత ఎగిరినా కూడా ఏపీలో ఒరిగేది లేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News