ఏపీ బీజేపీ సరికొత్త ప్లాన్ సక్సెస్ అవుతుందా ?
ఏపీ బీజేపీని బలోపేతం చేయడం ఇప్పుడు పార్టీ నేతలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు పెట్టిన పెద్ద టాస్క్. “మీరు ఏం చేస్తారో.. తెలీదు. పొరుగున ఉన్న కర్ణాటకలో [more]
;
ఏపీ బీజేపీని బలోపేతం చేయడం ఇప్పుడు పార్టీ నేతలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు పెట్టిన పెద్ద టాస్క్. “మీరు ఏం చేస్తారో.. తెలీదు. పొరుగున ఉన్న కర్ణాటకలో [more]
ఏపీ బీజేపీని బలోపేతం చేయడం ఇప్పుడు పార్టీ నేతలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు పెట్టిన పెద్ద టాస్క్. “మీరు ఏం చేస్తారో.. తెలీదు. పొరుగున ఉన్న కర్ణాటకలో చూడండి.. పార్టీ అధికారంలోకి వచ్చింది. మరిమీకు అన్ని వనరులు ఇస్తున్నాం. పదవులు ఇస్తున్నాం. మీరు స్పందించకపోతే.. కష్టం. మీరు ఏం చేసినా.. పార్టీని బలోపేతం చేయాలి“-ఇదీ.. ఇటీవల కేంద్ర బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి ఏపీ బీజేపీ నేతలకు అందిన సమాచారం. దీంతో ఏపీలో ఏదో ఒక ప్లాన్ చేసి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాయకులు ధృఢంగా నిర్ణయించుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేశారు.
పాదయాత్ర చేసేందుకు…?
ఈ క్రమంలోనే పాదయాత్ర చేయాలని కొందరు సీనియర్లు సూచించారు. అయితే.. దీనికి ఎవరు ముందుకు వస్తారు ? ఎలా ముందుకు వెళ్లాలి ? అనే విషయంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. పాదయాత్ర అనగానే.. చాలా మంది నోరెళ్ల బెట్టారని సమాచారం. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. పాదయాత్ర చేయడం ఎందుకు? ఏపీకి కావాల్సిన నిధులు.. ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే.. మంచిదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. కేంద్రం మాత్రం ఏపీ విషయంలో ఇవేవీ ఇవ్వకుండానే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచిస్తోంది.
ఫ్లాగ్ ఫిష్ కార్యక్రమాన్ని….
అయినప్పటికీ.. ఇప్పుడున్న పొజిషన్‌లో బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే.. ఖచ్చితంగా ఫ్లాగ్ షిప్ కార్యక్రమం చేపట్టాలని యువ నేతలు సూచిస్తున్నారు. దీనిపై నేతల మధ్య తర్జన భర్జన సాగుతున్న మాట వాస్తవం. ఏదో మీడియా ముందుకువ చ్చి.. రెండు మూడు విమర్శలు చేయడం , తర్వాత సైలెంట్ అయిపోవడం వల్ల ప్రయోజనం లేదనేది యువ నేతలు ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే.. జిల్లాల వారీగా పాదయాత్ర చేయడం మంచిదని మరికొందరు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దీనినివాయిదా వేసి.. జనవరి తర్వాత.. నిర్ణయం తీసుకుంటే మంచిదని.. మాజీ చీఫ్ సలహా ఇచ్చారట.
త్వరలోనే నిర్ణయం…?
మొత్తానికి పాదయాత్రపై బీజేపీలో పెద్ద ఎత్తున సమాలోచనలు అయితే.. జరిగాయి. దీనిపై నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. మరి చివరికి ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. గతంలో పార్టీ చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే ప్రతిపాదన చేసినప్పుడు.. వ్యతిరేకించిన ఒకరిద్దరు నేతలు ఇప్పుడు యాత్రకు మొగ్గు చూపడం. దీంతో బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.