Modi : వాత పెడతారు చూస్తూ ఉండండి

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఎలా విస్తరించిందో.. అదే తరహాలో కనుమరుగై పోయే అవకాశాలు కూడా స్పష్టంగా కన్పిస్తున్నాయి. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ [more]

;

Update: 2021-10-14 16:30 GMT

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఎలా విస్తరించిందో.. అదే తరహాలో కనుమరుగై పోయే అవకాశాలు కూడా స్పష్టంగా కన్పిస్తున్నాయి. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ నాయకత్వాన్ని తేల్చే విధంగా ఉండనున్నాయని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా తన ఇమేజ్ ను దేశ వ్యాప్తంగా కోల్పోయారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్లు తమ దెబ్బను రుచి చూపించారు.

జిమ్మిక్కులు చేసినా….?

త్వరలో జరిగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా బీజీపీకి పరాభావం తప్పదంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ఈసారి జనాలు మోదీ వైపు చూసే ప్రసక్తి ఉండదన్నే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిత్యావసరాలు….

పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం మారిపోయిందన్న ఆరోపణలు లేకపోలేదు. అదానీ, అంబానీలకు దేశ సంపదను కట్టబెడుతున్నారు. దీంతో పాటు గ్యాస్, పెట్రోలు ధరలు అడ్డగోలుగా పెరుగుతుండటంతో ప్రజల్లో అసహనం కన్పిస్తుంది. నిత్యావసరాలు నింగినంటాయి. ప్రజలు రోడ్డెక్కక పోవచ్చు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయకపోవచ్చు. అలాగని వారు సర్దుకుని పోతున్నారనుకుంటే పొరపాటే. సమయం వచ్చినప్పుడు వాత పెడతారన్నది వాస్తవం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఇలాగే కుప్పకూలిపోయాయి.

అన్ని వర్గాలు….

ఇక ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించడం, విమానాశ్రయాలను, రైల్వే స్టేషన్లను సయితం ప్రయివేటు వారికి అప్పగించడం విమర్శలకు తావిస్తుంది. ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజలు మోదీ ప్రభుత్వంపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. అలాగని ఉన్నత వర్గాలు కూడా సానుకూలంగా లేవు. ఏ వర్గం కూడా మోదీకి అనుకూలంగా లేకపోవడంతో రానున్న కాలంలో బీజేపీ కి రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్నది వాస్తవం.

Tags:    

Similar News