మళయాళ మంత్రం అదేనట
భారతీయ జనతా పార్టీకి తన కంటూ ఒక వ్యూహం ఉంటుంది. రాష్ట్రాలు మారినప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తన బలం పెంచుకునేందుకు బీజేపీ [more]
భారతీయ జనతా పార్టీకి తన కంటూ ఒక వ్యూహం ఉంటుంది. రాష్ట్రాలు మారినప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తన బలం పెంచుకునేందుకు బీజేపీ [more]
భారతీయ జనతా పార్టీకి తన కంటూ ఒక వ్యూహం ఉంటుంది. రాష్ట్రాలు మారినప్పుడు వ్యూహాలు మారుస్తూ ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తన బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటుంది. త్రిపురలో బీజేపీ అలాగే సక్సెస్ అయింది. దశాబ్దాల పాటు ఉన్న కామ్రేడ్ల కంచుకోటను బీజేపీ త్రిపురలో బద్దలు కొట్టగలిగింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని కేరళలో అమలు చేసేందుకు సిద్ధమయింది.
త్రిపుర తరహా వ్యూహంతో….
త్రిపుర బీజేపీకి ఒక మోడల్. ఎందుకంటే ఊహించని విధంగా త్రిపురలో కమ్యునిస్టులను పక్కనపెట్టి అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏవైతే వ్యూహాలు అమలు చేశారో వాటినే కేరళలో కూడా అమలు చేయాలని బీజేపీ సిద్ధమయిపోయింది. 2018లో త్రిపురలో విజయం సాధించడానికి దాదాపు మూడేళ్ల కృషి ఉంది. కేరళలోనూ బీజేపీ దాదాపు రెండేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది.
క్రిస్టియన్ ఓటర్లను….
త్రిపుర తరహాలోనే ఇక్కడ కేరళలో క్రిస్టియన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహాన్ని రచించింది. త్రిపురలోనూ ఎన్నికలకు ముందు క్రిస్టియన్ మతానికి చెందిన వారిని పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేర్చుకుంది. వారికి అనుకూలమైన హామీలను ప్రకటించింది. ఇప్పుడు కేరళలో కూడా క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ క్రిస్టియన్లకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను ఇచ్చింది.
అసంతృప్తిగా ఉండటంతో….
ఇప్పుడు కూడా హిందూ ఓట్లతో పాటు బీజేపీ క్రిస్టియన్ల ఓట్లకు కూడా కేరళలో గాలం వేస్తుంది. ఇప్పటికే క్రిస్టియన్ మత పెద్దలు మోదీని స్వయంగా కలసి తమ సమస్యలను వివరంచారు. కేరళలో ముస్లిం ఓటర్లు దాదాపు 20 శాతం ఉన్నారు. ఇప్పటి వరకూ వారు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లకు మద్దతుదారులుగా ఉన్నారు. వారంతా ముస్లింలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ప్రయోజనాలు కల్పించడంతో క్రిస్టియన్లు కేరళలో అసంతృప్తిగా ఉన్నారని గ్రహించి వారిని దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తుంది. మరి బీజేపీ త్రిపుర వ్యూహం కేరళలో వర్క్ అవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.