అక్కడ బీజేపీ ఎదగకపోవడానికి అదే కారణమా?

కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో బీజేపీ ఎదగక పోవడానికి పార్టీ నేతలు చెబుతున్న కారణమే ఇందుకు ఉదాహరణ. కేరళలో [more]

Update: 2021-04-06 17:30 GMT

కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో బీజేపీ ఎదగక పోవడానికి పార్టీ నేతలు చెబుతున్న కారణమే ఇందుకు ఉదాహరణ. కేరళలో బీజేపీ ఎదగకపోవడానికి అక్షరాస్యత ఎక్కువగా ఉండటమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని పిస్తున్నాయి. చదువుకున్న వారు ఎక్కువగా ఉన్న చోట బీజేపీ ఎదగడానికి ఆస్కారం లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు.

హిందుత్వ నినాదంతో…..

భారతీయ జనతా పార్టీ హిందుత్వ నినాదంతో ఏర్పడిన పార్టీ. హిందువులను ఏకం చేస్తూ ఆ నినాదంతోనే అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అయోధ్య వివాదం నుంచి అన్నీ హిందుత్వ కార్డులనే బీజేపీ రాజకీయంగా వాడుకుంది. అందువల్లనే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగలిగింది. భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువగా ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు అనేక సెంటిమెంట్లను వివిధ రాష్ట్రాల్లో తెరపైకి తెస్తోంది.

మోదీ నిర్ణయాలు సయితం…

ఇక మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు సయితం అక్షరాస్యులు ఆలోచించే విధంగా ఉన్నాయి. ఏడేళ్ల పాలనలో దేశం అభివృద్ధి చెందకపోగా పారిశ్రామిక వేత్తలు లాభపడుతున్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మకానికి పెట్టేస్తున్నారు. ప్రజా సమస్యలను వదిలేసి పారిశ్రామిక వేత్తలకే బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.

అవును నిజమే….

నిత్యవసరాల ధరలు, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వంటి వాటిపై అక్షరాస్యులు ఎక్కువ శాతం మంది మోదీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేరళ ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయామన్న బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు సముచితంగానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి. కేరళలో 55 శాతం మంది హిందువులు ఉన్నా అక్కడ బీజేపీ బలపడక పోవడానికి అక్షరాస్యతే కారణమన్న నిజాన్ని బీజేపీ నేతలు ఎట్టకేలకు అంగీకరిస్తున్నారు.

Tags:    

Similar News