ఈ వైసీపీ మ‌హిళా ఎంపీ సైలెంట్‌ రాజకీయం చూశారా?

ఆమెను అంతా లక్కీ ఎంపీ అంటారు. అవును మరి ఎన్నికలు దగ్గర పడుతున్నదాకా ఆమె అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ అని ఆమెకే తెలియదు. కాంగ్రెస్ లో ఒక [more]

;

Update: 2021-08-17 02:00 GMT

ఆమెను అంతా లక్కీ ఎంపీ అంటారు. అవును మరి ఎన్నికలు దగ్గర పడుతున్నదాకా ఆమె అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ అని ఆమెకే తెలియదు. కాంగ్రెస్ లో ఒక సాధారణ నాయకురాలిగా ఉన్న ఆమె ఇలా వైసీపీలో చేరగానే అలా ఎంపీ టికెట్ ఇచ్చేశారు జగన్. అంతే కాదు, వైసీపీ ఊపులో ఆమె మంచి మెజారిటీతో గెలిచి దేశంలోని అత్యున్నత చట్ట సభలో మెంబర్ అయిపోయారు భీశెట్టి సత్యవతి. ఇక రెండున్నరేళ్ళు కావస్తోంది. ఆమె ఎంపీగా ఏమైనా చేశారా అంటే లేదు అని సొంత పార్టీ వారే అంటారు. మరో వైపు ఆమెకు స్థానికంగా కూడా పార్టీ నుంచి సహకారం కూడా పెద్దగా లేదు.

గుడ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ….

అయితే భీశెట్టి సత్యవతి తన రాజకీయ జీవితాన్ని లక్కీగా భావించడంలేదు. వీలైతే మరింతకాలం పొడిగించుకోవాలని చూస్తున్నారు. ఆమె విశాఖ ఎంపీ విజయసాయిరెడ్డితోనూ బాగానే ఉంటూ వస్తున్నారు. ఇపుడు ఏకంగా జగన్ తో కూడా గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మధ్య ఎంపీలతో జగన్ సమావేశం నిర్వహిస్తే అదే అదనుగా భీశెట్టి సత్యవతి జగన్ తో కొంతసేపు సమావేశమై తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్థావించారు. అదే విధంగా స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చార‌ని స్థానికంగా చ‌ర్చ న‌డుస్తోంది.

తన పరిస్థితిపై…?

జగన్ కూడా భీశెట్టి సత్యవతి చెప్పిన అన్ని విషయాలను సానుకూలంగా విన్నారని అంటున్నారు. తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలు, ప్రత్యేకించి లోకల్ ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్‌ రాజకీయాలు కూడా ఆమె అధినేత దృష్టికి తెచ్చారని అంటున్నారు. దాంతో పాటుగా తాను అనకాపల్లిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ కి వివరించారని అంటున్నారు. మొత్తానికి తనకు ఎంపీగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలేదని ఆమె ఫిర్యాదు చేసినట్లుగా మాత్రం తెలుస్తోంది. ఒక ఎంపీగా ఉంటూ ఎంతో చేయాలనుకున్న లోకల్ లీడర్స్ వల్లనే చేయలేకపోతున్నట్లుగా భీశెట్టి సత్యవతి వివరణ ఇచ్చారని తెలుస్తోంది.

దాడి డైరెక్షన్ లోనే?

జగన్ కూడా పరిస్థితులు అన్నీ గమనిస్తున్నారని, తొందరలోనే ఎంపీ భీశెట్టి సత్యవతి లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని అనుచరులు అంటున్నారు. మొత్తానికి గుడివాడ జోరు తగ్గించాలన్నదే ఎంపీ భీశెట్టి సత్యవతి వర్గీయుల డిమాండ్ గా ఉంది. మొత్తానికి ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఎంపీ తనదైన రాజకీయానికి తెర తీశారు అంటున్నారు. అయితే అన‌కాప‌ల్లి పార్లమెంటు ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా కూడా స‌త్యవ‌తి దృష్టంతా అన‌కాప‌ల్లి మీదే ఉంద‌న్న మ‌రో చ‌ర్చ కూడా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె ఇక్కడ నుంచి పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నా ? ఆమెకు ఎలాగూ టిక్కెట్ రాదు. అయితే ఈ సీటుపై కాచుకుని ఉన్న దాడి వీర‌భ‌ద్ర రావు డైరెక్షన్‌లోనే ఆమె ఇక్కడ స‌రికొత్త రాజ‌కీయం స్టార్ట్ చేశార‌ని మ‌రో టాక్ ? దీని ఫలితాలు, పర్యవసానాలు ఏంటో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News