బిగ్ టాస్క్….సక్సెస్ అవుతారా
విశాఖ జిల్లా అంటేనే ఏపీలో ప్రత్యేకం. ఇక్కడ ప్రజలు ప్రశాంతం. రాజకీయాలు కూడా సాఫీగానే సాగుతాయి. అయితే 2014 తరువాత వాతావరణం మారింది. జిల్లా రాజకీయాల్లో అధిపత్య [more]
విశాఖ జిల్లా అంటేనే ఏపీలో ప్రత్యేకం. ఇక్కడ ప్రజలు ప్రశాంతం. రాజకీయాలు కూడా సాఫీగానే సాగుతాయి. అయితే 2014 తరువాత వాతావరణం మారింది. జిల్లా రాజకీయాల్లో అధిపత్య [more]
విశాఖ జిల్లా అంటేనే ఏపీలో ప్రత్యేకం. ఇక్కడ ప్రజలు ప్రశాంతం. రాజకీయాలు కూడా సాఫీగానే సాగుతాయి. అయితే 2014 తరువాత వాతావరణం మారింది. జిల్లా రాజకీయాల్లో అధిపత్య పోరు కొనసాగి చివరికి టీడీపీని మింగేసింది. అర్బన్ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, రూరల్ జిల్లాలో చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రులుగా ఉండేవారు ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇద్దరినీ కలుపుదామని బాబు గట్టిగా అనుకున్నా కూడా కుదరలేదు. ఆఖరుకు పార్టీని బలిపెట్టాల్సివచ్చింది. ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. కానీ ఇపుడు చూస్తే ముగ్గురు మంత్రులయ్యారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి.
ఆ విధంగా ముగ్గురు కృష్ణులు….
విశాఖ జిల్లా నుంచి అధికారికంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. అయితే ఇంచార్జి మంత్రిగా వై.ఎస్. జగన్ కి అత్యంత సన్నిహితుడు మోపిదేవి వెంకట రమణను నియమించారు. మరో వైపు మున్సిపల్, పట్టణాభివృధ్ధి శాఖా మంత్రిగా బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు చెందిన వారు అయినా కూడా విశాఖలోనే తన హవా చాటుకుంటున్నారు. ఆయననకంటూ ఓ వర్గం ఉంది. వారిని చూసుకుని విశాఖ జిల్లాలో తన పలుకుబడిని పెంచుకుంటున్నారు. రెండు జిల్లాలలో తన చక్రం తిరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలు విశాఖలో అట్టహాసంగా జరిగాయి. ఆయన జిల్లా మంత్రి అన్నంతగా హడావుడి జరిగింది. ఇక మునిసిపల్ మంత్రిగా, సీనియర్ నేతగా ఆయన విశాఖ నుంచే సమీక్షలు, ఇతర అధికారిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
జగన్ ఆలోచన వేరు…..
ఇదిలా ఉండగా వై.ఎస్.జగన్ ముందు విశాఖ బిగ్ టాస్క్ గా ఉంది. అన్ని చోట్లా గెలిచినా విశాఖ సిటీ చేజారిపోయింది. ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వారే ఉన్నారు. దాంతో ఎలాగైనా జీవీఎంసీ మేయర్ సీటు గెలవాలని జగన్ తపన. అందుకోసం ఆయన ఇంచార్జి మంత్రిగా విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవిని నియమించారు. కాపుల నుంచి అవంతికి ఛాన్స్ ఇచ్చారు. బీసీ మంత్రిగా, మునిసిపల్ శాఖలు చూస్తున్న బొత్సకు సీనియర్ గా బాధ్యతలు చూడమన్నారు. . ఇది ఓ విధంగా మంచి వ్యూహమే. ముగ్గురూ కలసి పాటుపడితే విశాఖలో పార్టీ బలంగా ఉంటుంది. మరి వికటిస్తేనే చిక్కులు వస్తాయి. ఇప్పటికే వర్గాలుగా పార్టీ విడిపోయిన వేళ ముగ్గురు మంత్రుల మధ్య సమన్వ్యయం అవసరమని అంటున్నారు.