ఏపీ మరో యూపీ అవుతుందా? ముసుగులేమీ లేవట
ఏపీ మరోయూపీ అవుతుందా? అక్కడి మాదిరిగా ఇక్కడ కూడా రాబోయే అతికొద్ది రోజుల్లోనే.. మత కలహాలు, వివాదాలకు ఏపీ కేంద్రంగా మారిపోతుందా? అంటే తాజాగా బీజేపీ నేతలు [more]
ఏపీ మరోయూపీ అవుతుందా? అక్కడి మాదిరిగా ఇక్కడ కూడా రాబోయే అతికొద్ది రోజుల్లోనే.. మత కలహాలు, వివాదాలకు ఏపీ కేంద్రంగా మారిపోతుందా? అంటే తాజాగా బీజేపీ నేతలు [more]
ఏపీ మరోయూపీ అవుతుందా? అక్కడి మాదిరిగా ఇక్కడ కూడా రాబోయే అతికొద్ది రోజుల్లోనే.. మత కలహాలు, వివాదాలకు ఏపీ కేంద్రంగా మారిపోతుందా? అంటే తాజాగా బీజేపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీని మరిన్ని కలహాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? అంటే ఈ విషయంలో సోషల్ మీడియాలో ఔననే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్ని మతాలు ఉన్నా అందరూ కూడా సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగుతున్నారు. ఒకరికి ఒకరు సాయం చేసుకునే తత్వంతో ముందుకు సాగుతున్నారు.
మతపరమైన విజభజన రేఖ…
ఎన్నికల సమయంలో అయినా పండుగల సమయంలో అయినా మతాలకు అతీతంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం సహా ఎక్కడా మతపరమైన విభజన రేఖ అనేది లేకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తు న్నారు. అయితే.. ఇప్పుడు అనూహ్యమైన రాజకీయ వాతావరణం రాష్ట్రంలో ఏర్పడనుంది. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేసేందుకు రెడీ అయింది. దీనికి ఆ పార్టీ ఏమీ ముసుగులు ధరించి రావడం లేదు. నేరుగానే ప్రజల మధ్యకు వస్తోంది. అది కూడా గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు.. లాల్ కృష్ణ ఆద్వానీ అనుసరించిన రథయాత్రతో ముందుకు సాగాలని నిర్ణయించింది.
మరిన్ని వివాదాలకు…..
రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న ప్రముఖ క్షేత్ర కపిల తీర్థం నుంచి విజయనగరంలోని రామతీర్థం వరకు ఈ రథయాత్రను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించడం సంచలనంగా మారింది. వచ్చే నెలలోనే దీనికి ముహూర్తం పెట్టాలని నిర్ణయించారు. తద్వారా.. హిందూ మతస్తులను బీజేపీకి చేరువ చేసే లక్ష్యంతో నాయ కులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక, గతంలో నిర్వహించిన రథయాత్ర ను గమనిస్తే.. అనేక వివాదాలకు, అనేక మంది మరణాలకు కూడా అప్పటి రథయాత్ర సాక్షిగా మారింది. ఇప్పుడు ఇదే తరహాలో బీజేపీ నిర్ణయం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొబ్బరికాయ కొట్టేసి……
ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో.. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడ ఎలాంటి ఘటనలకు పాల్పడుతున్నారో తెలియడం లేదు. దాడులు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో హిందువులను ఈ రథయాత్రలు మరింత రెచ్చగొట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే రథయాత్రల ద్వారా ఏపీ.. యూపీ.. అవుతుందా? అంటూ.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుండడం గమనార్హం. మరి బీజపీ నేతలు మాత్రం రథయత్రకు కొబ్బరికాయ కొట్టేస్తామని ప్రకటించేశారు. అయితే రధయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత రధయాత్ర ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.