బొండాది… `మూడ్ ను బట్టి రాజకీయమా ?`
ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న టీడీపీకి.. నాయకులు వ్యవహరిస్తున్న తీరు మరింత ఇబ్బందిగా మారింది. నాయకులు.. ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ [more]
;
ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న టీడీపీకి.. నాయకులు వ్యవహరిస్తున్న తీరు మరింత ఇబ్బందిగా మారింది. నాయకులు.. ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ [more]
ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న టీడీపీకి.. నాయకులు వ్యవహరిస్తున్న తీరు మరింత ఇబ్బందిగా మారింది. నాయకులు.. ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పరువు పోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ.. నాయకులు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు వైఖరిపై ఇలాంటి వాదనే నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కావడం లేదు. పైగా.. తనకు ఎప్పుడు మూడ్ వస్తే.. అప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు.
కొన్ని విషయాల్లోనే…?
అలా మీడియా ముందుకు వచ్చినప్పటికీ.. తన వ్యక్తిగత విషయాలు.. లేదా అప్పటికి ఎంచుకున్న విషయాల వరకు మాత్రమే బొండా ఉమా మహేశ్వరరావు పరిమితం అవుతున్నారు తప్ప.. పార్టీ తరఫున వాయిస్ వినిపించడం లేదు. నిజానికి ఇప్పుడు.. విజయవాడ పరిధిలో గట్టి వాయిస్ వినిపించే టీడీపీ నేత అవసరం చాలా ఉంది. మరీ ముఖ్యంగా వైసీపీపై విరుచుకుపడే నేతల కోసం చంద్రబాబు సైతం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బొండా ఉమా గట్టిగా తన వాయిస్ వినిపిస్తే ఆయనకు పార్టీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని పార్టీలో చర్చకూడా సాగుతోంది. పైగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మాత్రం ఇలా సైలెంట్ అయిపోవడం పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. గతంలో పార్టీ అదికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అరెయ్.. ఒరెయ్.. అంటూ.. విరుచుకుపడిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికలను కూడా…?
పైగా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల వేళ బొండా ఉమా మహేశ్వరరావు ఇక్కడ పార్టీ ఎంపీ నానికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టడంతో పాటు నానా రచ్చకు కారణమయ్యారు. పైగా సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ ఘోరంగా ఓడింది. అసలు ఈ ఎన్నికలను బొండా ఉమా మహేశ్వరరావు పట్టించుకోలేదని స్థానిక కేడర్ కూడా తీవ్రంగా విమర్శలు చేసింది. ఇక ఇప్పుడు సరైన టైంలో కూడా ఆయన మౌనంగా ఉండడం.. దేనికి సంకేతమనేది.. ప్రధాన ప్రశ్న. ప్రతి విషయంలోనూ ఆయన స్పందించి ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వొచ్చు. ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆయన వాయిస్ కూడా వినిపించడం లేదు.
అవకాశం ఉన్నా…?
ఓ మంత్రితో ఆయన నిత్యం వివాదానికే సమయం సరిపెడుతున్నారనే వాదన కూడా ఉంది. ఈ సమయంలో నియోజకవర్గంలో పుంజుకునేందుకు మంచి అవకాశం ఉంచుకుని కూడా బొండా ఉమా మహేశ్వరరావు ఇలా వ్యవహరించడం.. తనకు గుర్తుకు వచ్చినప్పుడు మీడియా ముందుకు రావడం, పార్టీ కేడర్‌కు అందకుండా వ్యవహరించడం వంటివి నియోజకవర్గంలో ఆయనపై ఒకింత వ్యతిరేకత పెంచే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఆయన ఇప్పటికైనా మేల్కొంటే బెటరని సూచిస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గంలో పార్టీ పరంగా నిన్నటి వరకు ముందున్న బొండా ఉమా మహేశ్వరరావు ఇప్పుడు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దూకుడు ముందే బేజారవుతోన్న పరిస్థితి.