మైండ్ గేమ్ సక్సెస్ ఫుల్ గా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలా అమెరికా వెళ్లారో లేదో ఏపీ లో కొత్త రకం పాలిటిక్స్ మొదలై హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఎపి రాజధాని అమరావతి [more]

;

Update: 2019-08-26 08:00 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలా అమెరికా వెళ్లారో లేదో ఏపీ లో కొత్త రకం పాలిటిక్స్ మొదలై హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఎపి రాజధాని అమరావతి లో వచ్చిన వరదలు చూశారా ? ఈ చిన్న వరదకు ఈ ప్రాంతం మునిగిపోతే రేపు పదిలక్షల క్యూసెక్కుల వరద దాటి వచ్చి పడితే పరిస్థితి ఏమిటి ? ముంపు ప్రాంతం, పంటభూముల నేలలు కావడంతో లక్ష రూపాయలు అయ్యే ఖర్చు అమరావతిలో రెండు లక్షలు అవుతుంది. ఒకే సామాజిక వర్గం అభివృద్ధికి బాబు తన ప్లాన్ తయారు చేశారు. రాజధాని అంటే అందరిది. చంద్రబాబు శివరామకృష్ణన్ కమిషన్ చెప్పింది పక్కన పెట్టి నారాయణ కమిటీ చెప్పింది చేసి ప్రజాధనం వృధా చేశారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే.

వక్రీకరించారని ఇప్పుడు …

దీనిపై టిడిపి అనుకూల మీడియా లో దుమారమే రేగింది. ఇక సైలెంట్ గా వున్న జనసేన, బిజెపి లు సైతం సీన్ లోకి దిగిపోయాయి. ఇలా అన్ని వైపులా ముప్పేట దాడి జరిగింది. దాంతో బొత్స సత్యనారాయణ తన మాటలు వక్రీకరించారన్న వ్యాఖ్య చేసి మిన్నకుండి పోయారు. ఆ తరువాత అమెరికా టూర్ ముగించుకుని ముఖ్యమంత్రి జగన్ ఎపి కి తిరిగి వచ్చిన తరువాత మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై తమ ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటిస్తుందని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే వున్నానంటూ మరోసారి చర్చకు తెరతీశారు.

ఇప్పటికే భూముల ధరలు ఢమాల్ …

వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో భూముల ధరలు నేలకు దిగివచ్చాయి. తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ తో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసుకుని నాలుగు రూకలు వెనకేసుకోవాలని ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన గత ప్రభుత్వంలో వున్న బడాబాబుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. దాంతో ఒక టీం గా రైతులను ఎదురుపెట్టి రాజకీయానికి బడాబాబులు తెరలేపారు. అన్ని పార్టీల ముఖ్యులతో తమ ఉద్యమానికి మద్దతును సేకరించేందుకు నడుం కట్టారు.

బయటపడిపోయిన వ్యవహారం ….

రాజధాని మార్పు పై టిడిపి అనుకూల మీడియా ఒంటికాలిపై లేచింది. అయితే ఆ సందర్భంలో కొన్ని నిజాలు అనుకోకుండా చెప్పేసింది. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సామాజికవర్గం రైతులు 35 శాతం భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని పేర్కొంది. అమరావతి రాజధాని కాకపోతే 85 శాతం ఒక సామాజికవర్గం ఆర్ధికంగా దెబ్బ తింటుందని పేర్కొనడం గమనిస్తే ఎపి క్యాపిటల్ ప్రకటనకు ముందు జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ఏ స్థాయిలో జరిగిందన్నది తేలిపోతుంది. ఈ తెరవెనుక సంగతులు బయటకు రావాలంటే ఉన్నత స్థాయి విచారణ జరిపాలిసిన అవసరం ఎంతైనా వుంది అన్నది స్పష్టం అవుతుంది. బడాబాబుల రియల్ వ్యాపారం ప్రజల ముందు స సాక్ష్యాలతో ఆవిష్కరిస్తే రాజధాని ని మార్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎలాంటి ఆందోళన పెల్లుబికే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు లెక్కస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగనున్నదో.

Tags:    

Similar News