మంత్రి బొత్సకు ఆ ఎఫెక్ట్ బాగా పడిందా?
విజయనగరం జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఇటీవల జరిగిన రామతీర్థంలో రాముల వారికి జరిగిన ఘోర అవమానం ఘటన నుంచి సెగ బాగానే తలుగుతోందనే [more]
విజయనగరం జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఇటీవల జరిగిన రామతీర్థంలో రాముల వారికి జరిగిన ఘోర అవమానం ఘటన నుంచి సెగ బాగానే తలుగుతోందనే [more]
విజయనగరం జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఇటీవల జరిగిన రామతీర్థంలో రాముల వారికి జరిగిన ఘోర అవమానం ఘటన నుంచి సెగ బాగానే తలుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత, సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి వివరణ కోరినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి రాష్ట్రంలో అనేక ఆలయాలపై దాడులు జరిగినా రామతీర్థంలో జరిగిన ఘటన మాత్రం పరాకాష్టగా మారింది. హిందువులు ఎంతో ఆరాధనా భావంతో పూజించుకునే రాముడి తలను కొందరు దుండగులు ఛేదించడాన్ని హిందూ సామాజిక వర్గం జీర్ణించుకోలేక పోతున్న మాట వాస్తవం. పైకి దీనికి ఎన్ని రాజకీయాలు అంటగట్టినా వాస్తవంగా మాత్రం ప్రజల్లో చాలా ఆవేదన ఉంది.
ప్రజల్లో ఆగ్రహం…..
దీంతో ఈ విషయంపై జగన్ తెప్పించుకున్న ఇంటిలిజెన్స్ నివేదికలో ఇవే విషయాలు స్పష్టమయ్యాయి. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం సృష్టించే అవకాశం ఉందని నివేదికలు అందాయి. దీంతో ఒకింత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హుటాహుటిన.. ఈ వివాదం నుంచి తప్పించుకునేందుకు కాయకల్ప చికిత్సకు దిగింది. ఈ క్రమంలోనే విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ.. విజయనగరం జిల్లాలో అన్నీతానై వ్యవహరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణపై జగన్ ఒకింత ఆగ్రహంతో ఉన్నారనేది వైసీపీ నేతల మాట. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కన్వీనర్‌గా విజయసాయిరెడ్డి ఉన్నప్పటికీ.. విజయనగరంలో బొత్స సత్యనారాయణ దూకుడే ఎక్కువగా ఉంది.
ఘటన జరిగిన తర్వాత….?
దీంతో అన్నీ బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అయితే.. రామతీర్థం వంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఈ విషయాన్ని పసిగట్టడంలోను, లేదా.. ఘటన జరిగిన తర్వాత.. దాని నుంచి ప్రభుత్వంపై విమర్శల బాణాలు పడకుండా నిలువరించడంలోను.. బొత్స సత్యనారాయణ విఫలమయ్యారనేది వైసీపీ అధినేత భావిస్తున్నారని అంటున్నారు సీనియర్లు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది? విజయనగరంలో ఘటనకు ముందు తర్వాత.. జరిగిన పరిణామాలు.. వంటివాటిపై నివేదిక ఇవ్వాలంటూ బొత్స సత్యనారాయణను ఆదేశించారని తెలిసింది.
ఇబ్బందిగా మారకముందే…?
అంతేకాదు.. విజయనగరంపై బొత్స సత్యనారాయణకు ఉన్న పట్టు నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత.. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకముందుగానే.. వ్యూహాత్మకంగా బొత్స వ్యవహరించి, ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పెట్టేలా వ్యవహరించి ఉంటే బాగుండేదనేది జగన్ మాటగా సీనియర్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బొత్స సత్యనారాయణ నివేదికను కోరారనేది వాస్తవమని.. అయితే.. ఆయన ఏం చేస్తారో చూడాలని అంటున్నారు.